E-Paper
Advertisement

Yellampet Municipality: ఎల్లంపేట మున్సిపాలిటీలో.. చైర్మన్ పీఠంపై కొలువుదీరిన బీఆర్ఎస్..!

Yellampet Municipality: ఎల్లంపేట మున్సిపాలిటీలో.. చైర్మన్ పీఠంపై కొలువుదీరిన బీఆర్ఎస్..!
Advertisement

Yellampet Municipality: స్వేఛ్చ బ్యూరో: ఎల్లంపేట మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఉత్కంఠభరితంగా ముగిసింది. మొత్తం 24 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో చైర్మన్ పదవికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 13 కాగా, బీఆర్ఎస్ పార్టీ 12 సీట్లతో ఒక ఓటు తక్కువలో నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 8 సీట్లు, బీజేపీ 4 సీట్లు సాధించాయి. చైర్మన్ ఎన్నికలో మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (MLA Mallareddy)కి ఉన్న ఎక్స్-అఫీషియో ఓటు కీలకంగా మారింది. ఈసారి ఆయన తన ఓటు హక్కును వినియోగించారు. బీజేపీ సభ్యులు బీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించడంతో బీఆర్ఎస్‌కు అవసరమైన మెజార్టీ లభించింది. దీంతో ఎల్లంపేట మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది.

Also Read: Suspicious Death: నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం.. పొలంలో మైననర్ బాలిక మృతి..!

కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్..

Advertisement

బీఆర్ఎస్ తరఫున 8వ వార్డు సభ్యురాలు లావుడియా శ్రీదేవి(Sridevi) చైర్మన్‌గా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా బీజేపీకి చెందిన 12వ వార్డు సభ్యురాలు మేకల రజిత దేవేందర్ రెడ్డి(Rajith Dvende Reddy) ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ పదవికి మేకల రజిత పేరును నరసింహ ప్రతిపాదించగా, బిందెల కుమార్ మద్దతు తెలిపారు. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు వాకౌట్ చేశారు. చైర్మన్ పదవికి బీఆర్ఎస్ అభ్యర్థి లావుడియా శ్రీదేవి పేరును చిన్నోల భాస్కర్ ప్రతిపాదించగా, సద్ది నిశిత మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తరఫున శాంతిని ముత్యాలు గౌడ్ పేరును వేణు ప్రతిపాదించి మద్దతు ఇచ్చారు. ఓటింగ్‌లో శ్రీదేవికి 17 మంది మద్దతు లభించగా, శాంతికి 8 మంది మద్దతు లభించింది.

ఎంపీ ఈటల రాజేందర్..

ఇక ఎంపీ ఈటల రాజేందర్ ఎక్స్-అఫీషియో ఓటుకు అప్లై చేసినప్పటికీ సమావేశానికి హాజరు కాలేకపోవడంతో ఆయన ఓటు నమోదు కాలేదు. మొత్తం ఎక్స్-అఫీషియో ఓట్లు కలుపుకొని 26 మంది సభ్యులు ఉండగా, సమావేశానికి 25 మంది హాజరయ్యారు. ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నెలకొన్నాయి.

Advertisement

Also Read: Lakshminarayana: రాజకీయాలకు లక్ష్మీనారాయణ గుడ్ బై? మ‌ళ్లీ ఉద్యోగంలోకి..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×