E-Paper
Advertisement

BRS vs Congress : సభా సమరం.. నెగ్గెదెవరు? తగ్గెదెవరు?

BRS vs Congress : సభా సమరం.. నెగ్గెదెవరు? తగ్గెదెవరు?
Advertisement

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితమే ప్రారంభం అయ్యాయి. ఈసారి నదీ జలాలపైనే ప్రధాన చర్చ ఉంటుందని సీఎం రేవంత్ ఇప్పటికే హింట్ ఇచ్చారు. అందుకోసం మంత్రులు, అధికారులు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. గత పదేళ్లలో కేసీఆర్ నదీ జలాలు, ప్రాజెక్టుల మీద తీసుకున్న నిర్ణయాలు, ఒప్పంద కాపీలను సిద్ధం చేయాలని సీఎం, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించగా వారంతా సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.ఈసారి పక్కా ఆధారాలతో బీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తున్నది.

కేసీఆర్ ఉంటారా?

ఇటీవల కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. కృష్ణా నీటిని ఏపీ దోచుకుంటున్న రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని.. ఇదో ప్రభుత్వమా? అని విమర్శించారు. అందుకు కాంగ్రెస్ కూడా బలంగానే కౌంటర్ ఇచ్చింది. అదే టైంలో కేసీఆర్ అసెంబ్లీకి రావాలని.. అక్కడే సమగ్ర చర్చ జరుపుదామని, ఎవరు తెలంగాణకు ద్రోహం చేశారో తేలిపోతుందని సవాల్ విసిరారు. నేటి అసెంబ్లీ సమావేశానికి కేసీఆర్ అయితే వచ్చారు. కానీ, జాతీయగీతాలాపన తర్వాత రిజిస్టర్‌లో సంతకం చేసి నందినగర్‌లోని తన నివాసానికి వెళ్లిపోయారు.ఇదిలాఉండగా, నేడు చర్చ ఏమీ ఉండదని వెళ్లిపోయినట్లు తెలుస్తున్నది.

సంతాపం.. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక..

Advertisement

ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సెషన్స్‌లో ఈ ఏడాది మరణించిన మాజీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దామోదర్ రెడ్డికి సభా సంతాపం ప్రకటించనుంది.అనంతరం డిప్యూటీ స్పీకర్‌గా ఎస్టీ వర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌ను ఎన్నుకోనున్నారు. ఆ తర్వాత రెండు రోజుల పాటు సభను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వాయిదా వేయనున్నారు. మరల జనవరి 2, 3వ తేదీన సభా సమావేశాలు జరగనున్నాయి.ఈ క్రమంలోనే కేసీఆర్ అటెండెన్స్ వేసుకుని వెళ్లిపోయినట్టు బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

కేసీఆర్ వర్సెస్ రేవంత్..

నదీ జలాలపై జరిగే చర్చకు కేసీఆర్ వస్తారని గులాబీ వర్గాల్లో టాక్. అదే నిజమైతే అసెంబ్లీలో మాటల యుద్ధం తప్పదని ప్రచారం జరుగుతోంది.కేసీఆర్, రేవంత్ మధ్య మాటల తూటాలు పేలుతాయని స్పష్టంగా తెలుస్తున్నది. గోదావరి, కృష్ణా జలాలను వినియోగంపై బీఆర్ఎస్ హయాంలో పలు కీలక ఒప్పందాలు జరిగాయి. ఆ తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. దీంతో గత ప్రభుత్వం చేసిన తప్పులు, ఒప్పందాలు, నిధుల దుర్వినియోగం, టీఎంసీల కేటాయింపుల వారీగా సీఎం రేవంత్ ఆధారాలతో సహా బీఆర్ఎస్ పార్టీని నిలదీయాలని సిద్ధమైనట్టు తెలుస్తున్నది. అదే టైంలో కేసీఆర్ సైతం ఎటువంటి వ్యూహాలకు పదును పెడతారో అనేది తెలియాల్సిఉన్నది. కేసీఆర్ నిజంగా చర్చకు వస్తారా? లేక కేటీఆర్, హరీశ్ రావులకే ఆ బాధ్యతను అప్పగిస్తారా? అనేది సైతం సస్పెన్స్‌గా మారింది. అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ పీపీటీ ద్వారా కేసీఆర్ హయాంలో జరిగిన ఒప్పందాలు, ప్రాజెక్టుల వివరాలను సభ్యులకు వివరించనున్నారు.తమకు కూడా చాన్స్ ఇవ్వాలని ప్రతిపక్షం పట్టుబడుతోంది. ఇలా ఒకరినొకరు ఢీ అంటే ఢీ అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ రాకపోయినా? కాంగ్రెస్ పార్టీ వద్దనున్న ఆధారాలకు బీఆర్ఎస్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోతే ప్రజల్లో ఆ పార్టీ గ్రాఫ్ మరింత పడిపోయే అవకాశం ఉన్నదని, కేసీఆర్ చెప్పినవన్నీ అబద్ధాలే అని తేలిపోతుంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×