E-Paper
Advertisement

Medchal Municipal Results: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెల్లడి!

Medchal Municipal Results: మూడుచింతలపల్లి మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కైవసం.. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెల్లడి!
Advertisement

Medchal Municipal Results: స్వేచ్ఛ బ్యూరో, మేడ్చల్ జిల్లాలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీపై బీఆర్‌ఎస్ పార్టీ ఆధిపత్యం సాధించింది. మొత్తం 24 వార్డుల ఫలితాలు వెలువడగా బీఆర్‌ఎస్ స్పష్టమైన మెజారిటీతో మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. వివరాల ప్రకారం, బీఆర్‌ఎస్ పార్టీ 14 వార్డులు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 9 వార్డులు, బీజేపీ 1 వార్డు గెలుపొందాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే బీఆర్‌ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. మున్సిపాలిటీ పగ్గాలు దక్కించుకోవడంతో అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Also Read: Minister Seethakka: ములుగు మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం.. మంత్రి సీతక్క ఏమన్నారంటే?

ఎల్లంపేట మున్సిపల్‌లో బీఆర్‌ఎస్ ఆధిక్యం

Advertisement

మేడ్చల్ స్వేచ్ఛ: ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తి కాగా, మొత్తం 24 వార్డుల ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు సాధించి మున్సిపాలిటీలో ఆధిక్యం ప్రదర్శించింది.మొత్తం 24 వార్డులకు గాను బీఆర్‌ఎస్ పార్టీ 12 వార్డులు,కాంగ్రెస్ పార్టీ 8 వార్డులు,బీజేపీ పార్టీ 4 వార్డులు గెలుచుకున్నాయి. ఫలితాలు వెల్లడైన వెంటనే గెలుపొందిన అభ్యర్థులు, పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు సాధించిన బీఆర్‌ఎస్ పార్టీ మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు.

Also Read: CM Chandrababu In Assembly: సీఎం రేవంత్ ప్రతిపాదన.. అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు రియాక్ట్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×