E-Paper
Advertisement

Khammam Police: ఖమ్మంలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. ర్యాలీలు, ధర్నాలు నిషేధం.. సీపీ సునీల్ దత్ హెచ్చరిక!

Khammam Police: ఖమ్మంలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు.. ర్యాలీలు, ధర్నాలు నిషేధం.. సీపీ సునీల్ దత్ హెచ్చరిక!
Advertisement

Khammam Police:  మజీ సీఎం కేసీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు విచారణ చేస్తున్నారని నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. టిఆర్ఎస్ చేపట్టిన ఈ ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు 100 మందికి మించి ర్యాలీ నిర్వహించకూడదని, దిష్టిబొమ్మలను దగ్ధం చేయడం, ట్రాఫిక్ కు అంతరాయం కలిగించకుండా కార్యక్రమం నిర్వహించాలని ఖమ్మం ఎసిపి కార్యాలయం నుండి పోలీసులు అనుమతి ఇచ్చారు.

200 మందికి పైగా బైకులతో ర్యాలీ

ఈ నిబంధనలకు విరుద్ధంగా 11 గంటలు దాటినప్పటికీ పరిమితికి మించి 200 మందికి పైగా బైకులతో ర్యాలీ నిర్వహిస్తూ దాదాపు 300 మందితో ఇల్లందు క్రాస్ రోడ్ పై అడ్డంగా బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. దిష్టిబొమ్మ దహనం చేసే చర్యను నిలువరించేందుకు ప్రయత్నించిన పోలీసులపై పెట్రోల్ చల్లుతూ బహ బ్రాంతులకు గురిచేస్తూ ఉద్దేశపూర్వకంగా ఇన్స్పెక్టర్ కరుణాకర్ విధులకు ఆటంకం కలిగించి, గాయపరచడంతో అతని చేయి విరిగిందని స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స అందించామని సిపి సునీల్ తెలిపారు. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఖమ్మం టూ టౌన్ ఎస్ఐ ఉఫాతుల్ రఫీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పగడాల నాగరాజు, అతని అనుచరులు పోలెపొంగు ఉపేందర్, వెంకట్ లను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నామవరపు కిరణ్, భూక్య అశోక్ మరికొంతమందిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని తెలిపారు.

Advertisement

Also Read: Karimnagar Municipal Elections 2026: కరీంనగర్ మేయర్ పీఠం దక్కేదెవరికి?

ఈనెల 28 వరకు సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలు

శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సిటీ పోలీస్ యాక్ట్ ఆంక్షలు అమల్లో ఉన్నందున ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమికూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహకాలు చేయొద్దని హెచ్చరించారు.

Advertisement

Also Read: Ganja Seized: ధూల్‌పేటలో గంజాయి దందా గుట్టురట్టు.. ఎక్సయిజ్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×