E-Paper
Advertisement

BRS Petition: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై సుప్రీంలో బీఆర్ఎస్ పిటిష‌న్ దాఖ‌లు..

BRS Petition: ఎమ్మెల్యేల అన‌ర్హ‌త‌పై సుప్రీంలో బీఆర్ఎస్ పిటిష‌న్ దాఖ‌లు..
Advertisement

BRS Petition: బీఆర్ఎస్ నుంచి పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త విష‌యంలో సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ పార్టీ రెండు పిటిష‌న్లు దాఖ‌లు చేసింది. 10 మంది ఎమ్మెల్యేల‌పై ఫిర్యాదు చేసిన 9 నెల‌లు అవుతున్నా.. స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇంకా ఎలంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని బీఆర్ఎస్ పేర్కొంది.

ఎమ్మెల్యేలు క‌డియం శ్రీహ‌రి, తెల్లం వెంక‌ట్రావు, దానం నాగేంద‌ర్‌కు వ్య‌తిరేకంగా ఎస్ఎల్‌పీ దాఖ‌లు చేసింది. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాద‌య్య‌, డాక్ట‌ర్ సంజ‌య్, అరికెపూడి గాంధీ, ప్ర‌కాశ్ గౌడ్, మ‌హిపాల్ రెడ్డి, కృష్ణ‌మోహ‌న్ రెడ్డిపై రిట్ పిటిష‌న్ దాఖ‌లు చేసింది.

Advertisement

Also Read: APCOB Jobs: గుడ్ న్యూస్.. ఈ జిల్లాల్లో ఉద్యోగాలు.. ఇంకా వారం రోజులే గడువు

హైకోర్టు తీర్పు ఇచ్చి ఆరు నెల‌లైనా ఇప్ప‌టికీ స్పీక‌ర్ చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించ‌లేద‌ని కోర్టుకు బీఆర్ఎస్ పేర్కొంది. క‌నీసం ఎలాంటి నోటీసు కూడా ఇవ్వ‌లేద‌ని పిటిష‌న్‌లో వివరించింది. గ‌తంలో కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పునే ఇప్పుడు కూడా అమ‌లు చేయాల‌ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టును కోరింది. పార్టీల ఫిర్యాదుల‌పై స్పీక‌ర్ మూడు నెల‌ల్లో నిర్ణ‌యం చెప్పాల‌ని కేశం మేఘా చంద్ర కేసులో తీర్పు వ‌చ్చింద‌ని గుర్తు చేసింది. మేఘా చంద్ర కేసు తీర్పుకు అనుగుణంగా స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకోవట్లేద‌ని బీఆర్ఎస్ తెలిపింది. నాలుగు వారాల్లో స్పీక‌ర్ నిర్ణ‌యం తీసుకునేలా ఆదేశాలివ్వాల‌ని బీఆర్ఎస్ పిటిషన్‌లో పేర్కొంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×