E-Paper
Advertisement

BRS : భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం..తెలంగాణ భవన్ లో వేడుకలు

BRS : భారత్‌ రాష్ట్ర సమితి ఆవిర్భావం..తెలంగాణ భవన్ లో వేడుకలు
Advertisement

BRS : దేశ రాజకీయ యవనికపై కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ సారథ్యంలో భారత్‌ రాష్ట్ర సమితి..బీఆర్ఎస్ ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరు భారత్‌ రాష్ట్ర సమితిగా మార్పు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకను హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నిర్వహించారు.

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకల్లో ఈసీ పంపిన లేఖకు అంగీకారం తెలుపుతూ ముహూర్తం ప్రకారం మధ్యాహ్నం 1.20 గంటలకు కేసీఆర్‌ సంతకం చేశారు. దీంతో భారత్‌ రాష్ట్ర సమితి పేరు అమల్లోకి వచ్చింది. కేసీఆర్‌ సంతకం చేసిన లేఖను అధికారికంగా ఈసీకి పంపనున్నారు. బీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. బీఆర్ఎస్ కండువాను కప్పుకున్నారు. ఆవిర్భావ వేడుకలకు కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీనటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు.

Advertisement

ఈ వేడుకల్లో పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణ భవన్‌ వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాణసంచా కాలుస్తూ ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×