E-Paper
Advertisement

Harishrao Meeting: నేతలతో హరీష్‌రావు భేటీ.. సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు నో రిలీఫ్, ఈడీ ముందుకు అరవింద్ కుమార్

Harishrao Meeting: నేతలతో హరీష్‌రావు భేటీ.. సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు నో రిలీఫ్, ఈడీ ముందుకు అరవింద్ కుమార్
Advertisement

Harishrao Meeting: సుప్రీంకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు ఊరట దక్కలేదు. ఆయన వేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణం విచారణ చేపట్టేందుకు నిరాకరించింది న్యాయస్థానం. కేటీఆర్ పిటిషన్‌పై జనవరి 15న (బుధవారం) విచారణ చేపట్టనుంది ధర్మాసనం. న్యాయస్థానం సూచనతో కేటీఆర్ ఊరట లభించలేదు. కేటీఆర్ పిటిషన్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందుగా కేవియట్ దాఖలు చేసిన విషయం తెల్సిందే.

ఇదిలావుండగా తెలంగాణ భవన్‌లో హరీష్‌రావు పార్టీ సీనియర్ నేతలతో సమావేశ మయ్యారు. ఫార్ములా కేసులో ఏసీబీ విచారణను సమీక్షిస్తున్నారు హరీష్‌రావు. పార్టీ ఆఫీసులో ఉండి ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, పలువురు బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.

Advertisement

మరోవైపు ఇదే కేసులో ఈడీ ముందుకొచ్చారు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్. బషీర్ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ సంస్థకు నిధులు బదిలీపై ఆయనను ప్రశ్నిస్తోంది. విచారణ నేపథ్యంలో ఏసీబీ ఇచ్చిన ఆధారాలను ఈయన ఈడీకి ఇవ్వనున్నట్లు సమాచారం.

Advertisement

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×