E-Paper
Advertisement

MLA Mahipal Reddy to join Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గూడెం మహిపాల్ రెడ్డి..?

MLA Mahipal Reddy to join Congress: బీఆర్ఎస్‌కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గూడెం మహిపాల్ రెడ్డి..?
Advertisement

MLA Gudem Mahipal Reddy likely to join Congress: కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసలు కొనసాగుతున్నాయి. శనివారం ఉదయం శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, శుక్రవారం సాయంత్రం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో మొత్తం ఇప్పటివరకు 9 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా మరో ఎమ్యెల్యే కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది.

పటాన్ చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని సమాచారం. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలతో సదరు శాసనసభ్యుడు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితం తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించున్నారు. ఈయన చేరికతో కాంగ్రెస్ పార్టీలో చేరినవారి సంఖ్య పదికి చేరనున్నది.

Advertisement

Also Read: పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందిస్తాం: రేవంత్ రెడ్డి

కాగా, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×