E-Paper
Advertisement

BRS Manne Krishank Arrest Update: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. ఆ కేసులో అరెస్ట్..

BRS Manne Krishank Arrest Update: బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ అరెస్ట్.. ఆ కేసులో అరెస్ట్..
Advertisement

BRS Manne Krishank Arrest: తెలంగాణ ఖనిజాభివృద్ధి మాజీ ఛైర్మన్, బీఆర్ఎస్ దళిత నేత, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ అరెస్టయ్యారు. కొత్త‌గూడెం నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా గతరాత్రి ఆయనను పంతంగి చెక్ పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

అనంతరం వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నేరుగా న్యాయమూర్తి వద్ద హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆయనకు 14 రోజులు రిమాండ్ విధించారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. క్రిశాంక్‌ను విచారించేందుకు రేపోమాపో పోలీసులు న్యాయస్థానంలో పిటీషన్ వేయనున్నారు. రీసెంట్‌గా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టళ్ల మూసివేతకు సంబంధించి ఫేక్ లేఖలో సంతకాలు ఫోర్జరీ చేసి సోషల్‌మీడియాలో పోస్టు చేశారన్న వ్యవహారంపై అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంపై ఉస్మానియా యూనివర్సిటీ వార్డెన్ ఫిర్యాదు మేరకు పోలీసుస్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది.

Advertisement

ఉస్మానియా హాస్టల్ మూసివేతకు సంబంధించి కేసీఆర్ పలుమార్లు తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించిన విషయం తెల్సిందే. మరోవైపు క్రిశాంక్ అరెస్ట్‌పై కారు పార్టీ రియాక్ట్ అయ్యింది. క్రిశాంక్ ఉద్యమ గొంతుకని, అన్యాయంగా అరెస్ట్ చేశారని సోషల్‌మీడియా వేదికగా కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ వైఫల్యాలు, ఢిల్లీలో బీజేపీ అరాచకాలపై గళమెత్తినందుకే అదుపులోకి తీసుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్-బీజేపీలు కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Also Read: T-congress Manifesto : తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్.. 5 న్యాయాలు, ప్రత్యేక హామీలు

Advertisement

 

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×