E-Paper
Advertisement

సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్!

సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి అంటూ.. సంచలన వ్యాఖ్యలు చేసిన బాల్క సుమన్!
Advertisement

Balka Remarks: బిఆర్ఎస్ భవన్‌లో నిర్వహించిన తెలంగాణ బొగ్గు గని కార్మికుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సింగరేణి ఆఫీస్‌ని తగలబెట్టండి ఏమైనా చూసుకుందామంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మిలిటెంట్ తరహాలో పనిచేయాలంటూ బొగ్గు గని కార్మికులకు పిలుపునిచ్చారు. పని చేస్తే పెద్ద ఎత్తున చేయాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీరు సింగరేణి జిఎం ఆఫీస్‌ను తగలబెడితే డబ్బులు అవే వస్తాయి అంటూ బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

శాంతి భద్రతలకు విఘాతం..

ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడాన్ని సమర్థించేలా బాల్క సుమన్ మాట్లాడడంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సింగరేణి సంస్థ పరిరక్షణ పేరుతో నిర్వహించిన మీటింగ్‌లో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయంటూ పలు నాయకుల నుండి ఆరోపణలు వస్తున్నాయి. సింగరేణి భవన్‌ను తగలబెట్టాలంటూ బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో రాజకీయ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Advertisement

Also read: గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు!

హింసాత్మకంగా పనిచేయండి..

మన ప్రోగ్రాంలకు రైతులు వస్తలేరని అన్నారు. మనం ఎక్కడ ఏ ప్రోగ్రాం చేపట్టినా నలుగురు ఐదుగురు రైతులే ఉంటున్నారు. మనోళ్లు ఏమో వందల మంది ఉంటున్నారు. ప్రెస్ మీట్లలో, సోషల్ మీడియాలో ముచ్చట్లు చెప్పుడు కాదు. హింసాత్మకంగా పని చేయాలంటూ బాల్కసుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన వ్యాఖ్యలపై పలువువురు రాజకీయ నాయుకులు తీవ్రంగా విమర్షించారు.

Advertisement

Also read: భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. అమెరికా ఇరాన్ లొల్లితో భారత్‌కు కొత్త తిప్పలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×