E-Paper
Advertisement

మెగా డీఎస్సీ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్!

మెగా డీఎస్సీ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వంపై జీవన్ రెడ్డి ఫైర్!
Advertisement

Jeevan Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలపరిమితి ముగిసిపోతున్నా, ఎన్నికల ముందు ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యావ్యవస్థను ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు.

నిరుద్యోగులను ముంచిన నోటిఫికేషన్లు

Advertisement

ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు ఆశలు రేకెత్తించిన ‘మెగా డీఎస్సీ’ నోటిఫికేషన్ ఇప్పటివరకు ఏమైందని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. వేలాది మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తుంటే ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అలాగే రాష్ట్రంలో 19 వేల కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉంటే, కేవలం 5 వేల పో

Also Read: అల్లుడితో అక్రమ సంబంధం.. అడ్డువచ్చాడని భర్తను కిరాతకంగా చంపిన భార్య!

Advertisement

జీవో-09 రద్దు చేయాల్సిందే..

విద్యార్థులపై తీవ్ర ఆర్థిక భారం మోపేలా తీసుకొచ్చిన ‘జీవో-09’ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉత్తర్వులు పేద, మధ్యతరగతి విద్యార్థుల ఉన్నత చదువులకు శాపంగా మారబోతున్నాయన్నారు. గత 30 నెలల పాలనలో ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క కొత్త గురుకుల పాఠశాలను కూడా నిర్మించలేకపోయిందని, ఇప్పుడు ‘యంగ్ ఇండియా స్కూల్స్’ పేరుతో కేవలం రాజకీయ గిమ్మిక్కులు చేస్తోందని ఆరోపించారు.

రూ.10 వేల కోట్ల ఫీజు బకాయిలు

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.10 వేల కోట్లకు చేరినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. బడ్జెట్‌లో విద్యా రంగానికి నిధులు కేటాయిస్తున్నట్టు చూపిస్తూ, ఆచరణలో మాత్రం రూపాయి కూడా ఖర్చు చేయడం లేదని మండిపడ్డారు. సకాలంలో నిధులు విడుదల కాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు కాలేజీల్లో సర్టిఫికెట్లు అందక, ఫీజులు కట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×