E-Paper
Advertisement

Kavitha Effect on BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొత్త సవాల్.. కవిత ఎదుగుదలే గులాబీకి ముప్పా?

Kavitha Effect on BRS: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు కొత్త సవాల్.. కవిత ఎదుగుదలే గులాబీకి ముప్పా?
Advertisement

Kavitha Effect on BRS:  బీఆర్ఎస్ పార్టీకి కవిత ఫోబియా పట్టుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపోటములపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలనుకున్నప్పటికీ ఆ టార్గెట్ చేరుకోవడంలో కవిత( kavitha)  ఎఫెక్టు పడుతుందని మధనపడుతున్నట్లు సమాచారం. ఆమె గులాబీ నేతలపై విమర్శలే కొంపముంచుతాయని పలువురు బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ప్రతివిమర్శలు చేయడంలోనూ గులాబీ నేతలు వెనక్కి తగ్గారు. ఆమెపై ఎక్కువగా మాట్లాడితే నష్టమని భావించే సైలెంట్ అవుతున్నారనే ప్రచారంజరుగుతుంది.

కవిత గండికొట్టే అవకాశం

మున్సిపల్ ఎన్నికల్లో కవిత బరిలోకి దిగారు. ఆల్ ఇండియా ఫార్వర్డు బ్లాక్(ఏఐఎఫ్బీ) పార్టీ పొత్తుతో సింహం గుర్తుతో పోటీచేస్తున్నారు. ఈపోటీతో గులాబీ పార్టీకి ఎఫెక్టు పడబోతున్నట్లు ఆపార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభావం ఉన్న మున్సిపాలిటీల్లో కవిత గండికొట్టే అవకాశం ఉంది. దీంతో గెలిచే మున్సిపాలిటీలన్ని చేజార్చుకుంటామని గులాబీలో ఆందోళన మొదలైనట్లు సమాచారం. జాగృతికి చెందిన నేతలు మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొత్తగూడెం ఎక్కువ మంది, మరో 35 మున్సిపాలిటీల్లో పోటీ చేస్తున్నారు.

Advertisement

Also Read: BRS Party: బీఆర్ఎస్‌లో టికెట్ల పంచాయతీ… రోడ్డెక్కిన నేతలు.. రెబల్స్ కొంపముంచే అవకాశం?

జాగృతి నేతలకు కల్వకుంట్ల కవిత బీఫారాలు

నిజామాబాద్, కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, గజ్వేల్, సిరిసిల్లతో పాటు పలు వార్డు, డివిజన్లలో బరిలోకి దిగుతున్నారు. మొత్తం 40 మున్సిపాలిటీలతో ఇంకా కొన్నింటిలో మొత్తం 250 డివిజన్లలో పోటీ చేస్తున్నారు. జాగృతి నేతలకు కల్వకుంట్ల కవిత బీఫారాలు సైతం ఇచ్చారు. పొత్తు పార్టీ ఏఐఎఫ్బీ సైతం పోటీచేస్తుంది. ఈ పార్టీ పోటీచేసేస్థానాల్లో ఆపార్టీ బీఫారాలు ఇచ్చింది. అయితే ప్రతి మున్సిపాలిటీలో జాగృతి సంస్థ నేతలు ఉన్నారు. మహిళల్లో కవితకు ఆదరాభిమానాలు ఉన్నాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. తక్కువ ఓట్లతో విజయం సాధిస్తుండటంతో కవిత ఓట్లను ప్రధానంగా బీఆర్ఎస్ ఓట్లు చీల్చుతారని దీంతో భారీ ఎఫెక్టు పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కవితపై విమర్శలు చేస్తే

Advertisement

జాగృతి అధినేత కవితపై విమర్శలు చేస్తే గులాబీపార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో నష్టం జరుగుతుందేనే కొంత సైలెంట్ అయినట్లు ప్రచారం జరుగుతుంది. జాగృతి జనంయాత్రలో కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు, ఎమ్మెల్యే తప్పిదాలను ఎండగట్టారు. ఈసమయంలో కొంతమంది గులాబీ నేతలు విమర్శలకు ప్రతి విమర్శలు చేశారు. అయితే మున్సిపల్ ఎన్నికల సమయంలో కవిత కౌంటర్లకు ఆచితూచీ కౌంటర్లు ఇస్తున్నారు. ఎక్కువగా విమర్శలు చేస్తే కవితను రాజకీయ నాయకురాలిగా ఎక్స్ ఫోజ్(గుర్తింపు తీసుకొచ్చిన) చేసిన వారమవుతామని భావిస్తున్నట్లు సమాచారం.

కవిత వ్యాఖ్యలకు కౌంటర్

ఆమె రాజకీయంగా ఎదిగితే గులాబీ పార్టీకే నష్టమని అందుకే ఏదో ఇవ్వలేదన్నట్లుగా కౌంటర్ లు తూతూమంత్రంగా ఇస్తున్నారని ఆపార్టీలోనే చర్చజరుగుతుంది. మరోవైపు మాత్రం కవిత చేసే విమర్శలకు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయని, కౌంటర్ ఇవ్వకపోతే నష్టం జరుగుతుందని, ఏ ఎన్నికలు వచ్చినా ప్రభావం పడితే గెలుపుపై తీవ్రంగా పడుతుందని అభిప్రాయపడుతున్నారు. సైలెంట్ ఉండొద్దని పేర్కొంటున్న పార్టీ అధిష్టానం కేసీఆర్ సైతం విమర్శలు వద్దని చెప్పడంతోనే కవిత వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడం లేదనే ప్రచారంజరుగుతుంది.

ఆచితూచీ కేటీఆర్ కౌంటర్

టార్గెట్ చేస్తున్న విమర్శలకు సైతం కేటీఆర్ ఆచితూచీ ఇస్తున్నారు. ఎక్కువ కాంట్రవర్సీకి పోకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు. కవితను గులాబీ పార్టీ నుంచి సస్పెండ్ చేశామని ఆమె వ్యాఖ్యలకు స్పందించాల్సిన అవసరం లేదు.. ఆమె పార్టీ కాదు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. కానీ ఒకటిరెండు మాటలతోనే కౌంటర్ ఇస్తుండటం రాజకీయ చతురత అని గులాబీ నేతలు పేర్కొంటున్నారు. కవితపై ఎక్కువ విమర్శలు చేస్తే తమకే నష్టమని భావించే ఘాటు విమర్శలు, వ్యక్తిగత విమర్శలు పార్టీలోని కీలక నేతలపై చేసినప్పుడు మహిళా నేతలతో కౌంటర్లు ఇప్పిస్తున్నారు.

Also Read:Kadiyam Srihari: పార్టీ ఫిరాయింపు కేసుల్లో కీలక మలుపు.. నేడు కడియంపై అనర్హత పిటిషన్ పై విచారణ! 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×