// // పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు -->
E-Paper
Advertisement

పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత.. వరంగల్‌కు కేటీఆర్, హరీష్‌రావు
Advertisement

Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఉదయం ఆయనను వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే వరంగల్‌‌కు కేటీఆర్, హరీష్ రావులు బయలుదేరారు.

బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డికి తీవ్ర అస్వస్థత- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం ఉదయం ఆయనకు  ఊపిరితిత్తుల్లో చిన్నపాటి సమస్యలు తలెత్తాయి. వెంటనే కుటుంబసభ్యులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. రోహిణీ ఆసుపత్రిలో ఆయనకు  చికిత్స చేస్తున్నారు వైద్యులు. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం విషయం తెలియగానే అభిమానులు, పార్టీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.

Advertisement

సీపీఆర్ తర్వాత ట్రీట్‌మెంట్- ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు చెప్పారు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయనకు అత్యవసరం వైద్యం అందిస్తున్నారు. ఆసుపత్రికి వెళ్లే సమయంలో ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సీపీఆర్ చేసిన తర్వాత ఆయన ట్రీట్‌మెంట్‌కు స్పందిస్తున్నట్లు వెల్లడించారు. దాదాపు 10 సార్లు ఆయనకు సీపీఆర్ చేసినట్టు సమాచారం. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.

వరంగల్‌కు కేటీఆర్-హరీష్‌రావులు- ఈ విషయం తెలియగానే బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం విషయం తెలియగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పలువురు నేతలు వరంగల్ కు బయలుదేరారు. ఇప్పటికే  మాజీ ఎంపీ వినోద్‌ కుమార్‌ అక్కడికి చేరుకుని వైద్యులతో మాట్లాడుతున్నారు.

Advertisement

మరోవైపు పెద్ది ఆరోగ్యంపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హంగామా చేయడంతో ఆసుపత్రి వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. సుదర్శన్ రెడ్డి ఆరోగ్యం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.  అటు పెద్ది కుటుంబ సభ్యులతో బీఆర్ఎస్ నేతలు మాట్లాడారు. సుదర్శన్‌రెడ్డి ఆరోగ్యం పర్వాలేదని దైర్యం చెప్పారు.

ALSO READ: భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో దగ్ధమైన 15 షాపులు, నల్గొండ జిల్లాలో ఘటన

 

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×