E-Paper
Advertisement

Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Jeevan Reddy: పోలీసుల లాగుల్లో తొండలు విడుస్తాం.. ఖబడ్దార్ సజ్జనార్… BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Advertisement

Jeevan Reddy:బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, పోలీసులను ఉద్దేశించి అత్యంత ఘాటుగా, హెచ్చరికల ధోరణిలో మాట్లాడారు. తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక్క పిలుపునిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని వ్యాఖ్యానించడం వివాద‌స్ప‌దంగా మారింది.

జీవన్ రెడ్డి తన ప్రసంగంలో పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. “పోలీసులకు లాగుల్లో తొండలు ఇరగొడతాం.. వచ్చేది వన్ సంవత్సరం రోజుల్లోనే మా ప్రభుత్వమే. సీపీ సజ్జనార్ ఖబర్దార్.. నీకు ప్రత్యేకంగా వార్నింగ్ ఇస్తా ఉన్నాం. నువ్వు ఏం పీక్కుంటావో పీక్కో.. మా బాసుని గానీ నా బొచ్చే పీకలేవు నువ్వు. నా మీద 2023లో నువ్వు కేసు పెట్టినప్పుడు ఏం చేయలేకపోయావు.. ఇప్పుడు మా బాసుని ఏం పీకుతారో నాయనా? జై కేసీఆర్! నా వెంట్రుక కూడా పీకలేడు.. నేను ఏదో మర్యాదగా ఉన్నాను. ఇక మా దాకా వస్తే వదలం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్క పిలుపిస్తే తెలంగాణ అగ్నికుండం అయిపోద్ది.” అని జీవ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Advertisement

మరోవైపు, తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నేడు (ఫిబ్రవరి 1, 2026) కీలక దశకు చేరుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని ఆయన నందినగర్ నివాసంలో సిట్ (SIT) అధికారులు సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి నుండి వెళ్ళాయి? ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా సూచనలు ఇచ్చారా? వంటి ప్రశ్నలపై అధికారులు ఆరా తీశారు. ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు వంటి అధికారుల నియామకాలు, డేటా ధ్వంసంపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉండనున్నాయి.

Advertisement

Read Also: Phone Tapping Case: కేసీఆర్ విచారణలో పార్ట్-1 కంప్లీట్.. మళ్ళీ విచారణకు పిలిచే అవకాశం ఉందా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×