E-Paper
Advertisement

BRS : బీఆర్ఎస్ VS కాంగ్రెస్.. రేపటి జలయుద్ధంలో చివరి గోల్ ఎవరిది?

BRS : బీఆర్ఎస్ VS కాంగ్రెస్.. రేపటి జలయుద్ధంలో చివరి గోల్ ఎవరిది?
Advertisement

రేపటి నుంచి తెలంగాణ శీతాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నదీ జలాలపై ఈ సందర్బంగా చర్చ ఉంటుందని సీఎం రేవంత్ ఇప్పటికే చెప్పారు. గత నెల 29న నిర్వహించిన బీఏసీ సమావేశంలోనూ అసెంబ్లీ ఎజెండాపై చర్చ జరిగింది. మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ప్రతిపక్ష సభ్యులు సైతం హాజరయ్యారు. రాష్ట్రానికి చెందిన కృష్ణా నదీ జలాలను ఏపీ దొంగిలించుకుపోతున్నదని ప్రతిపక్ష నేత కేసీఆర్ ఆరోపించడంతో అసెంబ్లీలో చర్చిద్దామని సీఎం రేవంత్ ప్రతిపక్షాలకు స్పష్టంచేశారు. కాగా, అసెంబ్లీ సెషన్స్‌లో కేసీఆర్ వస్తారా? రారా? అనేది దానిపై క్లారిటీ ఇంకా రాలేదు. ఆయన రాకపోవచ్చని చర్చ సైతం జరుగుతున్నది. ఎందుకంటే అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీశ్ రావును నియమించింది అందుకే అని కూడా ప్రచారం జరుగుతోంది.

పక్కా ఆధారాలతో..

ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఆశామాషీగా కాకుండా ఒక ప్రణాళికతో, పక్కా ఆధారాలతో ప్రతిపక్షాలకు గట్టిగా బుద్ది చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మంత్రులకు హింట్ ఇచ్చారు. అందుకే నదీ జలాలు, గత ప్రభుత్వంలో చేసుకున్న ఒప్పందాలు, బిల్లులు, కాంట్రాక్టులు, నిధులు వినియోగం, టీఎంసీల కేటాయింపులపై ప్రాపర్‌గా ప్రిపేర్ అయి రావాలని సీఎం రేవంత్ మంత్రులకు, ఎమ్మెల్యేలను ఆదేశించారు. సభలో కాంగ్రెస్ తరఫున సభ్యులు అందరూ హాజరుకావాలని.. ఆ బాధ్యతలను జిల్లా ఇన్‌చార్జి మంత్రులు తీసుకోవాలని కోరారు.విప్‌లు సైతం ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.

Advertisement

Read Also : Hyderabad Crime: ఏపీ, తెలంగాణ న్యూఇయర్‌ వేడుకల్లో విషాదం, ఒకరు బిర్యానీ తిని ఒకరు, మరొకరు

హోరాహోరీగా ప్రశ్నలు.. సమాధానాలు

మరోవైపు గులాబీ పార్టీకి చెందిన లీడర్లు సైతం ఈసారి ఎలాగైనా అధికార పార్టీని దెబ్బకొట్టేందుకు పకడ్బందీగా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. ఏపీ సీఎం చంద్రబాబు మొన్నటివరకు బనకచర్ల ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు తరలించుకుపోవాలని చూశారని.. ఇప్పుడు నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుతో కృష్ణ జలాల్లో ఏ విధంగా జలదోపిడీకి యత్నిస్తున్నారు.. ఆ విషయంలో రేవంత్ సర్కార్ వైఫల్యాన్ని నిరూపించాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ నదీ జలాలపై గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలు.. కట్టిన ప్రాజెక్టులు, నిధుల దుర్వినియోగంపై పీపీటీ ఇవ్వనున్నారు. తమకు కూడా పీపీటీ అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌‌కు గులాబీ ఎమ్మెల్యేలు వినతి పత్రం సైతం అందజేశారు.

చివరి గోల్ ఎవరిది?

Advertisement

కేసీఆర్ సభకు హాజరైతే సీఎం రేవంత్ వర్సెస్ ఆయన ఉన్నట్టు వార్ ఉండేది.కానీ ఇప్పుడు మంత్రి ఉత్తమ్,సీఎం రేవంత్ వర్సెస్ హరీశ్ రావు మధ్యే వాటర్ వార్ జరగనున్నట్లు టాక్ వినిపిస్తున్నది. కేసీఆర్ స్థానాన్ని అసెంబ్లీలో హరీశ్ భర్తీ చేస్తారని తెలుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో బచావత్ ట్రిబ్యునల్‌ సమావేశంలో కృష్ణా, గోదావరి జలాలపై ఎన్ని టీఎంసీలకు కేసీఆర్ అంగీకరించారు అనే విషయాలను కాంగ్రెస్ కార్నర్ చేయనున్నట్టు తెలుస్తుండగా.. కృష్ణాలో తెలంగాణకు కేవలం 45 టీఎంసీలు చాలని కాంగ్రెస్ ఏపీతో ఒప్పందం చేసుకున్నదని హరీశ్ రావు ఆరోపిస్తున్నారు.ఇక గత సర్కారు చేసుకున్న ఒప్పందాలు, బిల్లుల ఆధారంగా చూపిస్తూ సీఎం రేవంత్ బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టనున్నట్టు తెలుస్తుండగా.. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. రెండు నుంచి నాలుగు రోజులు జరిగే సమావేశంలో చివరి గోల్ ఎవరు కొడతారో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×