E-Paper
Advertisement

Bonalu : లాల్‌దర్వాజ బోనాల సందడి.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు..

Bonalu : లాల్‌దర్వాజ బోనాల సందడి.. పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు..
Advertisement

Bonalu : భాగ్యనగరం బోనమెత్తింది. పాతబస్తీలోని లాల్ దర్వాజ అమ్మవారి ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. వీఐపీలు క్యూ కట్టారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సింహవాహిని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆషాఢమాసం చివరి ఆదివారం లాల్‌దర్వాజ సింహవాహిని ఆలయంలో బోనాలు నిర్వహిస్తారు. 100 ఏళ్లకుపైగా చరిత్ర ఈ ఆలయం సొంతం. సోమవారం ఘటాలు, ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత రంగం నిర్వహిస్తారు. అనురాధ భవిష్యవాణి వినిపిస్తారు. ఆషాడ బోనాల సందడి రేపటితో పూర్తవనుంది.

Advertisement

బోనాల నేపథ్యంలో పాతబస్తీలో ఆదివారం, సోమవారం ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఫలక్‌నుమా, చార్మినార్‌, మీర్‌చౌక్‌, బహదూర్‌పురా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. సోమవారం రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని పోలీసులు తెలిపారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×