E-Paper
Advertisement

Charminar: చార్మినార్ కు బాంబు బెదిరింపు.. పోలీసుల హైఅలర్ట్..

Charminar: చార్మినార్ కు బాంబు బెదిరింపు.. పోలీసుల హైఅలర్ట్..
Advertisement

Charminar: బ్రేకింగ్ న్యూస్. చార్మినార్ దగ్గర బాంబు పెట్టినట్టు అగంతకుడు ఫోన్ చేశాడు. కాసేపట్లో పేలిపోతుందని హెచ్చరించాడు. అలర్ట్ అయిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.

పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు చార్మినార్ ప్రాంతానికి చేరుకున్నాయి. బాంబ్ స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానాస్పద వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ఇంచు ఇంచు పరిశీలించారు.

Advertisement

చార్మినార్ ప్రాంతంలో ఫుట్ పాత్ లపై ఉన్న షాపులను పోలీసులు తొలగించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. గంటకు పైగా తనిఖీలు చేసినా.. ఎలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో.. ఇది ఆకతాయిల ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తేల్చారు.

మంగళూరులో ఆటోలో కుక్కర్ బ్లాస్ట్ కలకలం రేపిన సందర్భంలో.. చార్మినార్ దగ్గర బాంబు పెట్టారనే వార్త తీవ్ర కలకలం రేపింది. నిజంగానే బాంబు ఉందేమోననే భయంతో ఆ ప్రాంతవాసులు వణికిపోయారు. కట్ చేస్తే….

Advertisement

చార్మినార్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చిన మాట పూర్తిగా అబద్దమని ఆ తర్వాత పోలీసులు స్పష్టం చేశారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే చార్మినార్ ప్రాంతంలో సోదాలు చేశామని.. ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వచ్చిన కథనాలు పూర్తిగా అబద్దమని తేల్చి చెప్పారు.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×