E-Paper
Advertisement

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మూడు విమానాలకు బాంబు బెదిరింపు, అధికారులు అలర్ట్

Hyderabad News: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. మూడు విమానాలకు బాంబు బెదిరింపు, అధికారులు అలర్ట్
Advertisement

Hyderabad News: ఇండిగో విమానాల సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతోంది దేశం. రేపు లేదా ఎల్లుండి నుంచి పూర్తి స్థాయిలో విమానాలు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో విమానాలకు బాంబు బెదిరింపు రావడం కలకలం రేపుతున్నాయి.  శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి పలు విమానాలు వచ్చాయి. వాటిలో బాంబులు ఉన్నట్లు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్స్ వచ్చింది. వెంటనే అధికారులు ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్టు అలర్ట్

Advertisement

సోమవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు విదేశాల నుంచి పలు విమానాలు వచ్చాయి. వాటిలో ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ సంస్థకు చెందిన విమానం, లండన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన బ్రిటిష్ ఎయిర్‌వేస్ కి చెందిన మరో విమానం ఉంది. దీనికితోడు కేరళలోని కన్నూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో విమానం వచ్చింది.

Advertisement

కేరళలోని కన్నూర్ ఎయిర్‌పోర్ట్ – హైదరాబాద్ ఇండిగో ఎయిర్ లైన్స్ (6e7178)

ఫ్రాంక్ ఫాంట్ – హైదరాబాద్ లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ (LH-752)

లండన్- హైదరాబాద్ బ్రిటిష్ ఎయిర్ లైన్స్ ఉన్నాయి.

మూడు విమానాలకు బాంబు బెదిరింపు

ఈ మూడింటిలో బాంబు ఉన్నట్లు సోమవారం ఉదయం ఎయిర్‌పోర్టు అధికారులకు ఆగంతకుల నుంచి ఈ-మెయిల్ వచ్చింది. వెంటనే ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అప్పటికే రన్వేలో మూడు విమానాలు సురక్షితంగా ల్యాండింగ్ అయ్యాయి. 

వెంటనే సీఐఎస్‌ఎఫ్, బాంబ్ స్క్వాడ్‌ తో కలిసి సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు భద్రతా సిబ్బంది. అనుమానం వచ్చిన ప్రతి లగేజీని చెక్ చేస్తున్నారు. తనిఖీల తర్వాత ప్రయాణికులను ఎయిర్‌పోర్టు నుంచి ఐసోలేషన్ కు తరలించారు అధికారులు. మరోవైపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై క్షుణ్నంగా దర్యాప్తు మొదలుపెట్టారు.  

ALSO READ: సోమవారం నుంచి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025 ప్రారంభం

సోమవారం నుంచి హైదరాబాద్‌లో ‘తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025’ జరగనుంది.  44 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇవాళ మధ్యాహ్నం సమ్మిట్ ప్రారంభంకానుంది. అంతలోనే బాంబు బెదిరింపులు అంటూ ఈ-మెయిల్స్ రావడంతో అక్కడి అధికారుల్లో కాస్త టెన్షన్ మొదలైంది. ఎవరో ఆకతాయిలు కావాలని చేసి ఉండవచ్చని కొందరు అధికారుల మాట. అయినా పూర్తిగా చెక్ చేస్తేనేగానీ చెప్పలేమని అంటున్నారు. 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×