E-Paper
Advertisement

Indigo Airlines: హైదరాబాద్‌కు వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్‌లో 180 మంది ప్రయాణికులు

Indigo Airlines: హైదరాబాద్‌కు వెళ్లే విమానానికి బాంబు బెదిరింపు.. ఫ్లైట్‌లో 180 మంది ప్రయాణికులు
Advertisement

Indigo Airlines: ఇటీవల కాలంలో విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్, కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి. కొంతమంది కావాలనే ఫేక్ మెయిల్ చేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఇండిగో ఎయిర్ లైన్ ఫ్లైట్ కు కూడా బాంబు బెదరింపు మెయిల్ వచ్చింది. సౌదీ అరేబియాలోని మదీనా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం 6E058కు బాంబు బెదిరింపు రావడంతో గురువారం రోజున అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (SVPIA) అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనతో విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ విమానంలో మొత్తం 180 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.

విమానంలో బాంబు ఉన్నట్లు కంట్రోల్ రూమ్‌కు అజ్ఞాత కాల్ లేదా ఈమెయిల్ ద్వారా బెదిరింపు అందింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు, ఎయిర్‌లైన్ సిబ్బంది అప్రమత్తత ప్రకటించారు. ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని.. ఈ విమానాన్ని హైదరాబాద్‌కు చేరుకోకముందే అహ్మదాబాద్‌లో దారి మళ్లించారు. సురక్షితంగా అత్యవసర ల్యాండింగ్ చేశారు. ల్యాండింగ్ అయిన వెంటనే.. విమానాన్ని ఐసోలేషన్ బేలోకి తరలించారు.

Advertisement

అత్యవసర ల్యాండింగ్ అనంతరం, విమానంలో తనిఖీలు నిర్వహించడానికి భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ (BDS), డాగ్ స్క్వాడ్, స్థానిక పోలీసులు కలసి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. గంటల తరబడి సాగిన విస్తృత తనిఖీల్లో విమానంలో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేదా పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని భద్రతాధికారులు స్పష్టం చేశారు. విమానాన్ని హైదరాబాద్‌కు పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసులు ఈ బెదిరింపుకు పాల్పడిన వారిని గుర్తించేందుకు, చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ALSO READ: Hidma Encounter: హిడ్మా ఎన్ కౌంటర్ భూటకపు హత్య.. పట్టించింది ఆ ద్రోహులే.. మావోయిస్టుల సంచలన లేఖ

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×