E-Paper
Advertisement

Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!

Shamshabad Airport: శంషాబాద్‌లో టెన్షన్ టెన్షన్.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు మెయిల్!
Advertisement

Shamshabad Airport: శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కలకలం రేపింది. సింగపూర్ నుండి హైదరాబాద్‌కు వస్తున్న సింగపూర్ ఎయిర్ లైన్స్ (SQ 518) విమానంలో బాంబు ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈమెయిల్ రావడంతో విమానాశ్రయ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ విభాగం, ఉన్నతాధికారులు హై అలర్ట్ ప్రకటించి, అత్యవసర చర్యలు చేపట్టారు.

సింగపూర్ నుంచి బయలుదేరిన ఈ విమానం గాలిలో ఉండగానే బెదిరింపు రావడంతో, పైలట్లు, గ్రౌండ్ స్టాఫ్ సమన్వయంతో విమానాన్ని సురక్షితంగా శంషాబాద్ రన్‌వేపై ల్యాండ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే, ప్రయాణికులందరినీ అత్యంత జాగ్రత్తగా కిందికి దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం విమానాన్ని ప్రత్యేక ‘ఐసోలేషన్ బే’ (Isolation Bay) కు తరలించి, బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

Advertisement

ఈ ఆకస్మిక తనిఖీల నేపథ్యంలో విమానాశ్రయంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది విమానంలోని ప్రతి అంగుళాన్ని, అలాగే ప్రయాణికుల లగేజీని స్కానింగ్ మెషీన్ల ద్వారా పరీక్షించారు. ఈ ఘటనతో విమాన ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎయిర్‌పోర్ట్ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

Also Read: తెలంగాణ జూనియర్ డాక్టర్లకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల..!

Advertisement

మరోవైపు, ఈ నకిలీ బెదిరింపు మెయిల్ ఎక్కడి నుండి వచ్చిందనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ ప్రారంభించారు. విమాన ప్రయాణాలను అస్తవ్యస్తం చేస్తూ, ప్రజలను భయాందోళనకు గురిచేసే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని భద్రతా సంస్థలు హెచ్చరించాయి. ప్రాథమిక తనిఖీల అనంతరం ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×