E-Paper
Advertisement

BJP Mahadharna: కాంగ్రెస్ 420 హామీలు ఫెయిల్.. టీబీజేపీ మహాధర్నాలో నేతల ఆగ్రహం

BJP Mahadharna: కాంగ్రెస్ 420 హామీలు ఫెయిల్.. టీబీజేపీ మహాధర్నాలో నేతల ఆగ్రహం
Advertisement

BJP Mahadharna: తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో, ప్రధాన ప్రతిపక్షమైన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. ఇందులో భాగంగా, నేడు ఇందిరా పార్క్ వేదికగా బీజేపీ ‘ప్రజా వంచన దినం’ పేరిట భారీ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది.

ధర్నాలో పాల్గొన్న టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావు, బీజేపీ నేతలు..
ఈ ధర్నాకు టీబీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు నాయకత్వం వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన కీలక హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందంటూ నిరసనను తీవ్రతరం చేసింది. వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రెండేళ్లు గడిచినా ప్రజలను మోసం చేసిందని రామచందర్ రావు తీవ్రంగా ఆరోపించారు.

Advertisement

రెండేళ్లుగా ప్రభుత్వం అమలు చేయని హామీలపై ధర్నా..
ఈ మహాధర్నాలో రాష్ట్ర ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్‌ను బీజేపీ విడుదల చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలతో సహా వివిధ వర్గాలకు ఇచ్చిన దాదాపు 420 హామీలను ప్రభుత్వం అటకెక్కించిందని బీజేపీ నేతలు విమర్శించారు.

రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసగించిన కాంగ్రెస్ పాలన..
రైతులను రుణమాఫీ, రైతు భరోసా రూపంలో మోసం చేశారని, ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత నిరుద్యోగంలోనే మగ్గి పోతోందని, టీఎస్పీఎస్సీ వంటి సంస్థల్లో పారదర్శకత లేదని వారు ఆరోపించారు. మహిళలకు ఇస్తామన్న రూ. 2,500 మహాలక్ష్మి పథకం, వృద్ధులకు పెంచాల్సిన రూ. 4,000 పెన్షన్లు, పేదలకు కట్టిస్తామన్న ఇందిరమ్మ ఇళ్లు వంటి హామీలన్నీ గాలిలో దీపాలుగా మారాయని ధ్వజమెత్తారు.

Advertisement

మహాధర్నాకు Ghmc పరిధిలో ఉన్న 8 జిల్లాల నుంచి భారీగా జన సమీకరణ..
ధర్నాకు పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై కాంగ్రెస్ పాలన తీరుపై తమ నిరసనను వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 8 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో జనసమీకరణ చేసి, ఈ ధర్నా కార్యక్రమాన్ని బీజేపీ విజయవంతం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవాలు జరుపుకోవడం ప్రజలను వంచించడమే అని, వెంటనే వేడుకలను రద్దు చేసి, అమలు చేయని హామీలపై ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత ఎ. మహేశ్వర్ రెడ్డి వంటి వారు డిమాండ్ చేశారు.

Also Read: దారుణం.. కన్న తల్లిని ఆస్తుల కోసం రోడ్డుపై వదిలేసిన కసాయి కొడుకులు

గ్రామ స్థాయి వరకు పోరాటాన్ని ఉధృతం చేయడానికి బీజేపీ వ్యూహరచన..
హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్‌ ఫర్మేషన్ పాలసీ (HILTP) వంటి ప్రభుత్వ నిర్ణయాలపై కూడా బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మహాధర్నా ద్వారా కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, రానున్న రోజుల్లో గ్రామ స్థాయి వరకు తమ పోరాటాన్ని ఉధృతం చేయడానికి బీజేపీ వ్యూహరచన చేస్తోంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×