E-Paper
Advertisement

BJP Rebel Candidates: కమలంలో కల్లోలం.. బీజేపీ మున్సిపల్ రెబల్స్ పై సస్పెన్షన్ వేటు..!

BJP Rebel Candidates: కమలంలో కల్లోలం.. బీజేపీ మున్సిపల్ రెబల్స్ పై సస్పెన్షన్ వేటు..!
Advertisement

BJP Rebel Candidates: స్వేఛ్చ బ్యూరో: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిపై కమలం పార్టీ వేటు వేసింది. క్రమశిక్షణ చర్యలు ఉల్లంఘించడంతో పాటు పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నందున రాష్ట్ర క్రమశిక్షణ సంఘం 13 మందిని సస్పెండ్ చేస్తూ సోమవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.ఈ జాబితాలో ఉన్నవారంతా నిజామాబాద్ పార్లమెంట్ పరిధికి చెందినవారే కావడం గమనార్హం. తెలంగాణ వ్యాప్తంగా ఇతర జిల్లాల్లోనూ రెబల్ గా పోటీ చేసినా కేవలం నిజామాబాద్(Nizamabad) పార్లమెంట్ సెగ్మెంట్ కు చెందినవారిపైనే రాష్ట్ర నాయకత్వం వేటు వేయడం గమనార్హం.

Also Read: Mystery Movie OTT : ఒకరితో ఒకరికి సంబంధం లేని ఏడుగురు ఒకే హోటల్లో… నరాలు కట్టయ్యే సస్పెన్స్ ఉన్న సినిమా

యాడ్స్ పై న్యాయస్థానానికి బీజేపీ

Advertisement

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పేపర్ యాడ్ కు మున్సిపల్ శాఖ నిరాకరిచండంపై బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆగ్రహం వ్యక్తంచేసింది. నేడు, రేపు పేపర్ యాడ్స్ ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం ముందుగానే నిర్ణయించుకున్న నేపథ్యంలోనే మున్సిపల్ శాఖ యాడ్స్ ను నిరాకరించినట్లు కమలం శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల దృష్ట్యా అడ్వర్టైజ్మెంట్ కు అనుమతి ఉన్నా రద్దు చేయడంపై గుర్రుగా ఉన్నారు. ఈ అంశంపై రాంచందర్ రావు మాట్లాడుతూ.. ఇతర పార్టీలతో ముందుగానే తాము ఆయా పేపర్లలో యాడ్స్ ను బ్లాక్ చేసుకోవడంతో తమకు ఎక్కడ నష్టం జరుగుతుందోననే ఉద్దేశ్యంతో కాంగ్రెస్ సర్కార్ కావాలనే రద్దు చేయించిందని ఆరోపించారు. ఈ అంశంపై తాము న్యాయస్తానికి వెళ్లి అనుమతి తెచ్చుకుంటామని రాంచందర్ రావు స్పష్టంచేశారు.

Also Read: Balakrishna Gift: ట్విన్స్ పుట్టిన తర్వాత రామ్ చరణ్‌కు బాలయ్య బాబు పంపిన గిఫ్ట్ ఇదే.. అదిరిపోలా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×