E-Paper
Advertisement

Nitin Nabin: రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ.. నితిన్ నబీన్ సంచలన వ్యాఖ్యలు..!

Nitin Nabin: రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అంటూ.. నితిన్ నబీన్ సంచలన వ్యాఖ్యలు..!
Advertisement

Nitin Nabin: గిరిజన నేతలతో సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లాడారు. సమ్మక,సారలమ్మల స్ఫూర్తి ఇక్కడి మహిళలలో ఉందని అన్నారు. తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ ల్యాండ్ సర్వే జరగలేదని నితిన్ నబీన్ అన్నారు. మావోయిస్టుల వల్ల గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందని, బీజేపీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. గత UPA ప్రభుత్వం 4వేల కోట్లు మాత్రమే గిరిజనులకి ఖర్చుచేసిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం 15 వేల కోట్లు గిరిజనులకు ఖర్చు చేస్తోందని నితిన్ నబీన్ అన్నారు.

బీజేపీ బూత్ అధ్యక్షులతో మాట్లాడుతూ..

బీజేపీ బూత్ అధ్యక్షుల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సర్దార్ వల్లభాయి పటేల్ కృషి, 2028లో బీజేపీకి అధికారం ఖాయం అని అన్నారు. తెలంగాణ ఏర్పాటుపై లాభాపేక్ష లేకుండా బిజెపి సహకరించిందని అన్నారు. మేం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల కోసం పోరాడుతామని, మేము అధికారంలో ఉంటే ప్రజల కోసం పనిచేస్తాయని నితిన్ నబీన్ పేర్కోన్నారు. ప్రతి ఇంటికి బీజేపీనీ తీసుకెళ్లడమే క్యాడర్ కర్తవ్యం అని అన్నారు. రాహుల్ గాంధీ పార్ట్ టైమ్ పొలిటీషియన్, బీజేపీ కార్యకర్త ఫుల్ టైమ్ పొలిటిషన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు చూసాం. వారు కేవలం కుటుంబం కోసమే పనిచేశారని.. ప్రజల కోసం పనిచేయలేదని అన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టారని అన్నారు.

Advertisement

Also read: Palla Srinivasa Rao: కూల్ డ్రింక్స్ కంటే బీరే హెల్తీ.. ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు షాకింగ్ కామెంట్స్..!

అమలు చేయని హమీలు..

ప్రజలకు హామీలు ఇవ్వడం, మర్చిపోవడం కాంగ్రెస్ నినాదం అని, కేంద్రప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతిఇంటికి చేర్చాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం డిల్లీకి ATM గా మారిందని అన్నారు. మనం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చెప్పాలి. అమలుచేయని హామీలపై బీజేపీ కార్యకర్తలు పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడితే డబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని అన్నారు. మాజీ ప్రధాని పీవీకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవం ఇవ్వలేదని అన్నారు. ఆయనను ఎంతగానో కాంగ్రెస్ పార్టీ ఆవమానించిందని, బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. కరోనా టైంలో 80 కోట్లమందిని రక్షించిన ఘనత మన ప్రధాని మోడీదని నితిన్ నబీన్ పేర్కోన్నారు.   గిరిజన నేతలతో సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మాట్లడారు. సమ్మక,సారలమ్మల స్ఫూర్తి ఇక్కడి మహిళలలో ఉందని అన్నారు. తెలంగాణలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికీ ల్యాండ్ సర్వే జరగలేదని నితిన్ నబీన్ అన్నారు. మావోయిస్టుల వల్ల గిరిజనుల అభివృద్ధి ఆగిపోయిందని, బీజేపీ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. గత UPA ప్రభుత్వం 4వేల కోట్లు మాత్రమే గిరిజనులకి ఖర్చుచేసిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం 15 వేల కోట్లు గిరిజనులకు ఖర్చు చేస్తోందని నితిన్ నబీన్ అన్నారు.

నితిన్ నబీన్‌కి చేదు అనుభవం..

Advertisement

బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబిన్ చేదు అనుబవం ఎదురైంది. సభ ముగించుకొని వెల్లు క్రమంలో నితిన్ నబీన్ కాన్వాయ్‌ని NSUI నాయకులు అడ్డుకున్నారు. సుబేదారి వద్ద కాన్వాయ్‌ను అడ్డుకొని గోబ్యాక్ నితిన్ నబిన్ అంటూ NSUI నాయకులు నినాదాలు చేశారు. అనంతరం నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. పరిస్ధతిని అదుపులోకి తెచ్చేందుకు NSUI నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి సుబేదారి పోలీసుస్టేషన్‌కు తరలించారు.

Also read: బెంగాల్, యూపీ ఫార్ములా ఇక్కడ నడవదు.. నితిన్ నబీన్‌పై ఎంపీ చామల ఫైర్..! 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×