E-Paper
Advertisement

CM Revanth Reddy on BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు.. ‘2004 చరిత్రే రిపీట్ అవుతుంది’!

CM Revanth Reddy on BJP Manifesto: బీజేపీ మేనిఫెస్టోపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు.. ‘2004 చరిత్రే రిపీట్ అవుతుంది’!
Advertisement

CM Revanth Reddy on BJP Manifesto: దేశంలో ఇరవై ఏళ్ల కిందటి చరిత్రే మరలా పునరావృతమవుతుందని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని, ఇండియా కూటమే విజయం సాధిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

20 ఏళ్లు గడిచినా బీజేపీ మేనిఫెస్టోలో మార్పు రాలేదని అన్నారు. 2004లో షైనింగ్ ఇండియా మేనిఫెస్టోతో పోటీకి దిగిన బీజేపీ.. 2024లో కూడా వికసిత్ భారత్ పేరుతో అదే పాత ప్రయోగం చేసిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

Advertisement

గతంలో బీజేపీ వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్నా సరే.. దేశ ప్రజలు సోనియాగాంధీ నేతృత్వంలో తిరస్కరించారని సీఎం గుర్తు చేశారు. ప్రస్తుతం బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల మరోసారి దేశంలో అప్పుడు బీజేపీ ఎలాంటి పరిస్థితి అయితే ఎదురైందో.. మరోసారి అలాంటి పరిస్థితే వస్తుందన్నారు.

Also Read: Oppositions on BJP Manifesto: ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ప్రస్తావన లేదు.. బీజేపీ మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు ఫైర్

Advertisement

అప్పటిలాగే ఇప్పుడు కూడా రెండు సార్లు అధికారంలో ఉన్న బీజేపీకి శుభం పలికి.. రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ను దేశ ప్రజలు గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడే తమ కష్టాలు తీరుతాయని ప్రజలు ఆశగా చూస్తున్నారని అన్నారు. తాజాగా బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టో చెల్లని బ్యాంకు ఇచ్చిన చెక్కులా ఉందని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×