E-Paper
Advertisement

రేవంత్ సర్కార్ పై బీజేపి బిగ్ బాంబ్.. 1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తారా..!

రేవంత్ సర్కార్ పై బీజేపి బిగ్ బాంబ్.. 1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తారా..!
Advertisement

Ramchander Rao: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. కొత్త పార్టీలు అందరూ పెడతారని, కానీ ప్రజాదరణ ఏ పార్టీకి ఉంటుందన్నదే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారని, అందరి చూపు తమ పార్టీ వైపే ఉందన్నారు. ఎందుకంటే దేశంలో అవినీతి రహిత పాలనను మోడీ సర్కార్ అందిస్తోందన్నారు.

గతంలో కేఏ పాల్..

నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పండిట్ దీన్ దయాళ్ ప్రశిక్షణ్ అభియాన్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో బీజేపీకి మంచి వాతావరణం ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో కొత్త పార్టీలు రావడం సహజమని చెప్పుకొచ్చారు. గతంలో కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారని గుర్తుచేశారు. గతంలో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ.. ఇప్పుడు బీఆర్ఎస్ అయిందని, అలాంటిది.. పుట్టబోయే బిడ్డకు టీఆర్ఎస్ అని పేరు పెట్టారని ఎద్దేవాచేశారు.

Advertisement

Also Read: గుంటనక్కలతో దందాలు చేసింది మీరే కదా.. కవిత పై మహేష్ కుమార్ గౌడ్ ఫైర్!

రూ.1000 కోట్లు ఢిల్లీకి..

టీఆర్‌ఎస్, బీఆర్‌ఎస్ పేర్లు మారినా పాలన మారలేదని, రాష్ట్ర సంపదను దోచుకున్న వారే ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారని ఫైరయ్యారు. దోచుకున్న, దాచుకున్న సొమ్మును ప్రజలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్​యమంత్రి రేవంత్ రెడ్డి రూ.1000 కోట్లు ఢిల్లీకి పంపిస్తామని చెబుతున్నారని, వాటిని ప్రజల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రజా క్షేత్రంలోనికి వెళ్లి ప్రజా పోరాటాలు చేస్తోందని, అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని ఆయన ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ రావడంలో బీజేపీ ప్రధాన పాత్ర పోషించిందని ఆయన గుర్తుచేశారు. ఈ ప్రశిక్షణ తరగతులకు పార్టీ సంస్థాగత ఇన్ చార్జీ చంద్రశేఖర్ తివారి, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హాజరయ్యారు.

Advertisement

Also Read: గుడ్ న్యూస్.. నర్సాపూర్ మున్సిపాలిటీ నగర అభివృద్ధికి రూ.15 కోట్లు..!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×