E-Paper
Advertisement

Telangana BJP: చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాషాయ దళం.. వారి డిమాండ్లు ఇవే..?

Telangana BJP: చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన కాషాయ దళం.. వారి డిమాండ్లు ఇవే..?
Advertisement

Telangana BJP: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై కాషాయ పార్టీ పట్టుపడుతోంది. అందులో భాగంగా ఈనెల 23న చలో అసెంబ్లీ పేరిట పోరుబాటకు సిద్ధమవుతోంది. హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించడంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇప్పటికే మండల, జిల్లాస్థాయిలో కార్యక్రమాలు చేసిన బీజేపీ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. నేతలను విడుతల వారీగా అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చేలా ప్లాన్ చేసుకుంది. ఇదిలా ఉండగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఇదే అంశంపై ఎమ్మెల్సీ మల్క కొమురయ్య మాట్లాడారు.

ఫసల్ బీమా పథకం

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, వైఫల్యాలపై అసెంబ్లీని ముట్టడించనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక అమలుచేయడంలేదని విమర్శించారు. కేటాయింపులకు.., ఖర్చులకు ఏమాత్రం పొంతన లేదని ఫైరయ్యారు. విద్యారంగానికి 15 శాతం బడ్జెట్ ఉండాలని ముందే స్పష్టంచేసినా మొండిచెయ్యి చూపించారని, ఇతర రాష్ట్రాల కన్నా తక్కువ కేటాయించారని ధ్వజమెత్తారు. వ్యవసాయానికి కూడా సరిపడ కేటాయింపులు లేవన్నారు. తెలంగాణలో ఫసల్ బీమా పథకాన్ని ఎందుకు అమలుచేయడం లేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను.. రాష్ట్ర పథకాలకు చెప్పుకుంటోందని విమర్శించారు. ఈ ప్రభుత్వానికి విజన్ లేదని, రైజింగ్ 2047 అంటున్నారు తప్పితే ప్రాపర్ ప్లానింగ్ లేదని కొమురయ్య విరుచుకుపడ్డారు.

Advertisement

Also Read: Telangana Bills: మత పరమైన కామెంట్‌లపై ప్రభుత్వం ఉక్కుపాదం.. బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేక బిల్లు

అడుగడుగునా అవినీతి..

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేందర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక అడుగడుగునా అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థలన్నీ కుదేలయ్యాయని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని ఫైరయ్యారు. అసెంబ్లీ ముట్టడికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పాల్గొంటారని, నిరుద్యోగులు, ఫీజు రీయింబర్స్ మెంట్ రాని విద్యార్థులు, ఇండ్లు అందని పేదలు, పెన్షన్లు అందనివారు, వృద్ధులు, రైతులంతా ముట్టడిలో పాల్గొనాలని కోరారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి కొప్పు భాష మాట్లాడుతూ.. ప్రజలను మోసం చేసేలా బడ్జెట్ ఉందని విమర్శించారు. పరిపాలన చేతకాకపోతే సీఎం కుర్చీ నుంచి రేవంత్ దిగిపోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఫెయిల్యూర్ పై బీజేపీ ఉద్యమం ప్రారంభించిందన్నారు.

Advertisement

Also Read: Big TV Kissik Talks: డ్రెస్సింగ్ సెన్స్ పై శ్రీ సత్య కామెంట్.. చీరకట్టిన ప్రతి ఒక్కరూ పతివ్రత కాదు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×