E-Paper
Advertisement

ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

ఇది నిజమేనా.. ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్, బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?
Advertisement

Hyderabad: మోదీ మంత్రివర్గంలో మార్పులు-చేర్పులు జరగనున్నాయా? ఇటీవల మంత్రుల పని తీరును పర్యవేక్షించిన ప్రధాని మోదీ కొత్త నిర్ణయం తీసుకున్నారా? మంత్రివర్గంలో పాతవారిని తప్పించి, కొత్త వారికి చోటు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారా? ఈ క్రమంలో ఎంపీ అరవింద్ పేరు వెలుగులోకి వచ్చిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

ఎంపీ అరవింద్‌కు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్

Advertisement

విదేశీ పర్యటన తర్వాత మోదీ కేబినెట్‌లో మార్పులు తప్పవంటూ జోరుగా ప్రచారం సాగింది. గడిచిన రెండు రోజులుగా మంత్రులు చేపట్టిన పనులు, వారి పనితీరు అడిగి తెలుసుకున్నారు ప్రధాని. దాని ఆధారంగా ఏయే విభాగాల్లో ఎవరు బాగా పని చేస్తున్నారని చెప్పినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ కొత్త వార్త హంగామా చేస్తోంది.

తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్‌కు ప్రమోషన్ వచ్చిందంటూ ఓ వార్త హంగామా చేస్తోంది. ఈ విషయం తెలియగానే తెలంగాణలోని బీజేపీ శ్రేణులు ఆయనకు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారన్నది ఆ వార్త సారాంశం. అందులో నిజమెంతో తెలీదుగానీ ఆ విధంగా ప్రచారం సాగుతోంది. దీనికి సంబంధించి ఎంపీ అరవింద్ ఎలాంటి పోస్ట్ తన అభిమానులు, పార్టీ శ్రేణులతో పంచుకున్న సందర్భం లేదు.

Advertisement

బీజేపీ శ్రేణుల విషెస్, అసలు మేటరేంటి?

కాకపోతే నిజామాబాద్ జిల్లాలో ఎంపీ అరవింద్‌కు సంబంధించి పార్టీ శ్రేణులు అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ చెబుతున్నారట. దీంతో ఆయనకు పార్టీ పదవి ఇస్తారా? లేకుంటే కేబినెట్‌లోకి తీసుకుంటున్నారా? అనేది అసలు ప్రశ్న. ఇటీవల దేశవ్యాప్తంగా రాష్ట్రాల యూనిట్ అధ్యక్షులను ఎంపిక చేసింది బీజేపీ హైకమాండ్. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడ్ని ఎంపిక చేసింది.

ఇకపోతే జాతీయ పార్టీ, మోదీ కేబినెట్‌లో మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఎంపీ అరవింద్‌ను జాతీయ పార్టీలోకి తీసుకుంటారా? మోదీ కేబినెట్‌లోకి తీసుకుంటారా? అనే చర్చ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఈ వాదనను తోసి పుచ్చినవారు లేకపోలేదు.

ALSO READ: వాతావరణ శాఖ అలర్ట్.. తెలంగాణలో ఆ జిల్లాలకు వర్ష సూచన, కొద్ది గంటల్లో ఉరుములు, మెరుపులతో

సదరు ఎంపీ మద్దతుదారులు ఇలాంటి గాసిప్స్ క్రియేట్ చేశారని, అలాంటిదేమీ లేదన్నవాళ్లు లేకపోలేదు.  మొత్తానికి ఏదో విధంగా వార్తల్లోకి ఎక్కారు ఎంపీ అరవింద్. మరి ఆయనకు ప్రమోషన్ వచ్చిందో లేదో తెలియాలంటే కొద్ది గంటల్లోతేలిపోనుందని అంటున్నవాళ్లూ లేకపోలేదు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×