E-Paper
Advertisement

BJP: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అరెస్ట్.. బీజేపీ అలజడి..

BJP: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అరెస్ట్.. బీజేపీ అలజడి..
Advertisement
Telangana BJP news

Telangana BJP news(Today breaking news in Telangana): బీజేపీ మళ్లీ యాక్టివ్ అయింది. కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్‌లో ఉండిపోయినా.. లేటెస్ట్‌గా జోరు వానలోనూ తఢాఖా చూపించింది. చలో బాటసింగారం అంటూ డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల పరిశీలనకు పిలుపు ఇచ్చింది కమలదళం. అంతే ఒక్కసారిగా కలకలం.

పోలీసులు రాత్రి నుంచే అలర్ట్ అయ్యారు. కొందరు బీజేపీ ప్రముఖులను హౌజ్ అరెస్ట్ చేశారు. ఎక్కడికక్కడ కేడర్‌ను అడ్డుకున్నారు. పోలీస్ ఆంక్షలను లెక్క చేయకుండా.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు రోడ్డెక్కారు. బాటసింగారం బాట పట్టారు.

Advertisement

శంషాబాద్ ఏరియాకు వచ్చేసరికి వారిని అడ్డుకున్నారు పోలీసులు. ముందుకు వెళ్లనిచ్చేది లేదని చెక్ పెట్టారు. కిషన్ రెడ్డి వినలేదు. రఘునందన్ రావుతో కలిసి రోడ్డుపైనే బైఠాయించారు. జోరు వానలోనూ అలానే నడిరోడ్డుపై కూర్చున్నారు. పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాను ఓ కేంద్రమంత్రిని తననే అడ్డుకుంటారా? తానేమైనా ఉగ్రవాదినా? అని ఫైర్ అయ్యారు కిషన్‌రెడ్డి. శాంతియుతంగా పరిశీలనకు వెళుతుంటే అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదంటూ ఎమ్మెల్యే రఘునందన్ ప్రశ్నించారు. కల్వకుంట్ల పాలనలో పేదల ఆశలు అడియాసలయ్యాయని.. బీఆర్ఎస్‌ను గద్దె దించేవరకు పోరాడుతామని కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

Advertisement

అయినా, పోలీసులు వెనక్కి తగ్గలేదు. రోడ్డుపై ధర్నాకు దిగిన బీజేపీ అగ్రనేతలను బలవంతంగా వాహనంలో అక్కడి నుంచి తరలించారు. ఈ ఆందోళన వల్ల శంషాబాద్ ఏరియాలో తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. వానలోనూ బీజేపీ నేతల ఆందోళనకు ఫుల్ మైలేజ్ వచ్చింది. ఎంపీ బండి సంజయ్ ఎక్కడా కనిపించకపోవడం మాత్రం ఆసక్తికరం.

BJP-kishan reddy

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×