E-Paper
Advertisement

Bitthiri Sathi: క్షమాపణలు చెప్పిన ‘బిత్తిరి సత్తి’.. అసలేం జరిగిందంటే?

Bitthiri Sathi: క్షమాపణలు చెప్పిన ‘బిత్తిరి సత్తి’.. అసలేం జరిగిందంటే?
Advertisement

Bitthiri Sathi Offensive Video Viral: చేవెళ్ల రవికుమార్ కావలి అలియాస్ బిత్తిరి సత్తి భగవద్గీతను కించపరిచేలా వీడియోలో వ్యంగంగా వ్యాఖ్యలు చేశాడంటూ రాష్ట్ర వానరసేన పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా, ఈ వీడియోపై రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తి స్పందించారు. తప్పు జరిగింటే క్షమించాలని కోరాడు.

‘అందరికీ నమస్తే..నేను రవికుమార్ కావలి.. బిత్తిరి సత్తి. అయితే ఇటీవల ఓ వీడియో వైరల్ చేస్తున్నారు. అందులో వాస్తవం లేదు. ఎప్పటిలాగే నేను కామెడీ వీడియోలు చేస్తుంటా. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోను తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఎవరినీ కించపర్చలేదు. ఈ వీడియో అక్షర దోషం జరిగింది. భగవద్గీతను నేను ఆరాధిస్తా. పారాయణం చేసేందుకు ప్రయత్నిస్తా. ప్రచారం చేస్తుంటా. నా అభిమానులు, బంధుమిత్రులు బాధపడితే క్షమాపణలు చెబుతున్నా.’ అంటూ చెప్పాడు.

Advertisement

ఈ మేరకు ఓ వీడియోను బిత్తరి సత్తి విడుదలు చేశారు. ‘15 ఏళ్లుగా వీడియోలు చేస్తున్నా. ఇఫ్పుడు వీడియోను వైరల్ చేయడం వాళ్ల నిర్ణయానికే వదిలేస్తున్నా. నేను ఎప్పుడు మీ అందరినీ నవ్వించడానికి ప్రయత్నిస్తుంటా.’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Also Read: ఇందిరమ్మ ఇళ్లపై భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు

Advertisement

కాగా, హిందూవులు అత్యంత పవిత్రంగా భావించే భగవద్గీతను బిత్తిరి సత్తి వీడియో రూపంలో స్కిట్ చేశాడు. అయితే ఇందులో వ్యంగంగా భగవద్గీతను బిల్లుగీత అంటూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×