E-Paper
Advertisement

Shamshabad Airport: ఇండిగో విమానానికి ఢీ కొట్టిన పక్షి.. సేఫ్‌గా ల్యాండింగ్, ఎయిర్‌పోర్టులో తనిఖీలు

Shamshabad Airport: ఇండిగో విమానానికి ఢీ కొట్టిన పక్షి.. సేఫ్‌గా ల్యాండింగ్, ఎయిర్‌పోర్టులో తనిఖీలు
Advertisement

Shamshabad Airport: ఈ మధ్యకాలంలో పక్షుల తాకిడి పెరిగింది. ఏకంగా గాల్లో ప్రయాణిస్తున్న విమానాలను ఢీ కొడుతున్నాయి. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఆకాశంలో ఇలాంటి ఘటనలు జరగడంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన జరిగింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్న ఇండిగో విమానాన్ని ఓ పక్షి ఢీ కొట్టింది.

ఇండిగోకు తప్పిన ముప్పు.. విమానానికి ఢీ కొట్టిన పక్షి

Advertisement

పక్షి ఢీ కొట్టన విషయాన్ని పసిగట్టిన పైలెట్, విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండింగ్ చేశాడు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ఎటిసి అధికారులకు పైలట్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న ఎటిసి అధికారులు, సెక్యూరిటీ అధికారులతో కలిసి తనిఖీ చేస్తున్నారు. ఇండిగో విమానం గోవా నుండి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వస్తున్న ఈ క్రమంలో ఈ ఘటన జరిగింది.

ఇటీవలకాలంలో విమానాలను పక్షులు ఢీ కొట్టడం తీవ్రమైన సమస్యగా మారింది. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఆ తరహా ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పక్షులు.. విమానాల ఇంజన్లు లేకుంటే అద్దాలను ఢీ కొట్టడంతో అత్యవసరంగా ల్యాండింగ్‌ చేస్తున్నారు పైలట్లు. ఇంజిన్ బ్లేడ్‌లను దెబ్బతీయడం, ఫ్యూయల్ ట్యాంకులను తాకడం, కిటికీలను పగులగొట్టడం వంటి పరిణామాలకు దారి తీస్తున్నాయి.

Advertisement

శంషాబాద్ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండింగ్, ఆపై తనిఖీలు

ఈ సందర్భాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పక్షులు విమానాలకు ఢీ కొన్న ఘటనల్లో ఏడాది 500 మిలియన్లు డాలర్లు ఖర్చవుతుందని ఓ సంస్థ అంచనా వేసింది. యూఎస్ లాంటి దేశాల్లో ఈ తరహా ఘటనలు మరింత ఎక్కువగా జరుగుతుంటాయి.  విమానాలు 50 అడుగుల నుండి 800 అడుగుల మధ్య వెళ్తున్నప్పుడు పక్షులు ఢీ కొన్న ఘటనలు జరుగుతున్నాయి.

ఈ ఘటనల ప్రాణనష్టం జరగకపోయినా, విమానాలు ఆలస్యం బయలుదేరడం మొదలవుతుంది. ఒక్కోసారి రద్దు చేస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఒక్కోసారి అత్యవసరంగా ల్యాండింగ్ చేయడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు.

ALSO READ: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి.. ప్రచారానికి షా-నితిన్, మరి పవన్ భేటీ వెనుక

 

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×