E-Paper
Advertisement

BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే

BigTV Exclusive: ఓటుకు 10 వేలు పంచుతూ అడ్డంగా దొరికిపోయి.. ఎలా పారిపోయాడో చూస్తే
Advertisement

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం భానూర్‌లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేశారు. ఓటర్ల జాబితా దగ్గర పెట్టుకుని మరీ డబ్బు పంపిణీ జరిగింది. బిగ్‌టీవీ నిఘాలో డబ్బు పంపిణీ దృశ్యాలు బయటపడ్డాయి. మూడో వార్డు అభ్యర్థి సిరాజ్ ఓ ఇంట్లోకి ఓటరు లిస్టు, డబ్బులతో వెళ్లి సర్పంచ్ అభ్యర్థి శాంతయ్యకు, తనకు ఓటేయాలని ఓటర్లను మభ్య పెట్టారు. మీడియా అక్కడకు రావడం చూసి సిరాజ్ పరుగులు పెట్టాడు.

తప్పించుకోవడానికి దారి లేకపోవడంతో కిటికీ ద్వారా ఇంటిపై కప్పు ఎక్కి ఎస్కేప్ అయ్యాడు. తన దగ్గర ఉన్న‌ ఓటరు లిస్టు కింద పడిపోగా దాన్ని గమనించడంతో అందులో ఎవరెవరికి డబ్బులు ఇచ్చారు ఇంకా ఎవరెవరికి ఇవ్వాలన్న వివరాలు ఉన్నాయి. ఎవరికి మద్యం బాటిళ్లు ఇవ్వాలనే విషయాలను కూడా నోట్ చేసుకున్నారు. నందిగామ గ్రామంలో ఓటర్లకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు పోటాపోటిగా ఓటర్లను మభ్య పెట్టారు

Advertisement

ఓటుకు రూ. 10 వేల నుంచి రూ. 30 వేల వరకు ఇచ్చి ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. ఇలా ఒక‌ కుటుంబానికి రెండు పార్టీల నుంచి రూ. 3 లక్షల వరకు వచ్చినట్టు సమాచారం. ఈ విధంగా పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంపణి జరగలేదని కొంతమంది చెబుతుంటే.. డబ్బులు అందుకున్న వారు మాత్రం ఖుషీగా ఫీలవుతున్నారు. క్యాసారంలోనూ బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కైల అనిత ప్రభాకర్ రెడ్డి విచ్చల విడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్టు సమాచారం.

Advertisement

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×