E-Paper
Advertisement

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి రాఘవేందర్ రెడ్డి కన్నుమూత.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం

Raghavender Reddy: బిగ్ టీవీ చైర్మన్ తండ్రి రాఘవేందర్ రెడ్డి కన్నుమూత.. తెలుగు రాష్ట్రాల సీఎంల సంతాపం
Advertisement

Raghavender Reddy: బిగ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానెల్స్ ఛైర్మన్ వెన్నం విజయ్‌ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్‌ రెడ్డి (79) కన్నుమూశారు. బుధవారం రాత్రి అనారోగ్య సంబంధిత కారణాలతో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. రాఘవేందర్ రెడ్డి స్వస్థలమైన మహబూబాబాద్ జిల్లా రెడ్యాలలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా రాఘవేందర్ రెడ్డి.. మహబూబాబాద్ జిల్లా సంవిధాన్ బచావో కమిటీ సభ్యులుగా వ్యహరిస్తున్నారు. అయితే ఆయన అకాల మరణం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మంత్రులు, రాజకీయ ప్రముఖులు, పాత్రికేయులు, జర్నలిస్టులు సంతాపం తెలియజేస్తున్నారు.

చంద్రబాబు, రేవంత్ సంతాపం..

బిగ్ టీవీ న్యూస్ ఛానల్ చైర్మన్ వెన్నం విజయ్ రెడ్డి తండ్రి రాఘవేందర్ రెడ్డి మరణ వార్తపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. రాఘవేందర్ రెడ్డి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు రేవంత్ సంతాపాన్ని, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెడ్యాల గ్రామంలో రాఘవేంద్ర రెడ్డి కన్నుమూశారన్న వార్త విచారకరమని చంద్రబాబు అన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. అటు ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ సైతం శ్రద్ధాంజలి ఘటించారు. ‘వెన్నం రాఘవేందర్ రెడ్డి మృతి బాధాకరం. వారి మృతికి నివాళులు అర్పిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అంటూ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.

Advertisement

Advertisement

Also Read: AP Mandali Session-2026: మండలిలో పెన్షన్ పై రచ్చ.. అధికార-విపక్షాల మధ్య మాటకు మాట

తెలంగాణ మంత్రులు దిగ్భ్రాంతి..

వెన్నం రాఘవేందర్ రెడ్డి మరణంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా, సన్నిహితులకు కూడా తీరని లోటని పేర్కొన్నారు. మంత్రులు సీతక్క (Minister Seethakka), వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ సైతం బిగ్ టీవీ ఛైర్మన్ తండ్రి మరణంపై స్పందించారు. వారి మరణం కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు తీరని లోటని పేర్కొన్నారు. అటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం.. సంతాప ప్రకటన విడుదల చేశారు. ఈ క్లిష్ట సమయంలో విజయ్ రెడ్డి, వారి కుటుంబం ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సైతం రాఘవేందర్ రెడ్డి మరణం పట్ల సంతాపం తెలియజేశారు.

చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందన

బిగ్ టీవీ చైర్మన్ శ్రీ విజయ్ రెడ్డి గారి తండ్రి శ్రీ వెన్నం రాఘవేంద్రరెడ్డి మరణ వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వారి మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో విజయ్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాఘవేందర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. అలాగే ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యం మనోబలం వారి కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని కోరుకున్నారు.

Also Read: Fruits for workout: ఖాళీ కడుపుతో వర్కవుట్ చేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసుకోండి

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×