E-Paper
Advertisement

Heavy Rains In Telangana: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం.. తెలంగాణలో మరో 5 రోజుల పాటు..!

Heavy Rains In Telangana: సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షం.. తెలంగాణలో మరో 5 రోజుల పాటు..!
Advertisement

Heavy Rains In Telangana: సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడటంతో పలు ప్రాంతాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. మెదక్ జిల్లా పెద్దశంకరం పేట మండలం రామోజీపల్లిలో పిడుగుపాటుకు తాత, మనవడు మృతి చెందారు. నాగిలిగిద్ద మండలం ముక్తాపూర్‌లో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవగా, మొగుడంపల్లీలో 2.6 సెం.మీ. పాపన్న పేట మండలం లింగాయిపల్లిలో 1.9 సెం. మీ వర్షపాతం నమోదైంది.

ఇక ఇప్పటికే కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీంతో ఎన్నికల సామాగ్రి పంపిణీ వద్ద సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షంలోనే ఎన్నికల సామాగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు సిబ్బంది. దీంతో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Advertisement

తెలంగాణలో 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ పలు చోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ఇక ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఐఎండీ పేర్కొంది.

Advertisement

Also Read: తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్!

ఇక జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. నగర వాసులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×