E-Paper
Advertisement

మానవత్వం చాటుకున్న భువనగిరి ఎంపీ.. కంటిచూపు కోల్పోయిన చిన్నారికి కొండంత అండ

మానవత్వం చాటుకున్న భువనగిరి ఎంపీ.. కంటిచూపు కోల్పోయిన చిన్నారికి కొండంత అండ
Advertisement

MP Chamala: భువనగిరి పట్టణంలో వీధి కుక్కల దాడికి గురై తీవ్రంగా గాయపడి, దురదృష్టవశాత్తు కంటిచూపు కోల్పోయిన చిన్నారి ప్రియాంష్ ఉదంతంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలుడిని భువనగిరి ఎంపీ స్వయంగా పరామర్శించారు. చిన్న వయసులో ఇలాంటి ప్రమాదం జరగడం అత్యంత బాధాకరమని పేర్కొంటూ.. బాధితుడి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి వారికి ధైర్యం చెప్పారు.

బాలుడికి అందిన వైద్యంపై ఎంపీ ప్రత్యేక దృష్టి సారించారు. కంటికి సంబంధించిన ప్రాథమిక చికిత్స పూర్తయిన నేపథ్యంలో.. ఎల్.వి. ప్రసాద్ ఆసుపత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడి బాలుడి ప్రస్తుత ఆరోగ్య స్థితిగతులను , భవిష్యత్తులో అవసరమయ్యే చికిత్సల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అత్యుత్తమ వైద్యం అందేలా చూడాలని వైద్య బృందానికి సూచించారు.

Advertisement

ఈ ఘటనపై తక్షణమే స్పందించిన ఎంపీ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి గారితో, బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS) ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా చర్చించారు. ప్రియాంష్‌కు భవిష్యత్తులో అవసరమైన అత్యాధునిక వైద్య సహాయాన్ని బీబీనగర్ ఎయిమ్స్ ద్వారా ఉచితంగా , మెరుగ్గా అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు. ప్రభుత్వ యంత్రాంగం బాధితుడికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన ఆదేశించారు.

ఆడుకోవాల్సిన వయసులో కుక్కల దాడి కారణంగా కంటిచూపు కోల్పోవడం వర్ణనాతీతమైన వేదన అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, చిన్నారి కోలుకునే వరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

Advertisement

Also Read: ప్రేమ కోసం ప్రాణాలు తీసుకున్న లవర్స్.. వారికి గుడి కట్టి పెళ్లి చేస్తున్న గ్రామస్తులు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×