E-Paper
Advertisement

అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర ఫైర్!

అందినకాడికి దోచేసి.. ఇప్పుడు నీతులు చెప్తారా? హరీష్ రావుపై ఎమ్మెల్యే గండ్ర  ఫైర్!
Advertisement

Gandra Satyanarayana: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సింగరేణి సంస్థపై మాజీ మంత్రి హరీష్ రావు చేసిన స్కాం ఆరోపణలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి, బీఆర్ఎస్ వైఖరిపై నిప్పులు చెరిగారు. నిజాన్ని అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయడంలో కేసీఆర్ కుటుంబం దిట్ట అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సింగరేణిని నాశనం చేసింది బీఆర్ఎస్సే..

Advertisement

గడచిన పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి సంస్థను పూర్తిగా సర్వనాశనం చేశారని ఎమ్మెల్యే గండ్ర ధ్వజమెత్తారు. ఉన్నంతకాలం అందినకాడికి దోచుకుని, ఇప్పుడు ఏమీ తెలీనట్టు ‘దొంగే దొంగ’ అన్నట్లుగా హరీష్ రావు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సింగరేణిని అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడింది కాక, ఇప్పుడు మళ్లీ ఇక్కడికి వచ్చి పర్యటనలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు.

నిధుల మళ్ళింపు.. యాదాద్రి ప్లాంట్ నిర్వాకం!

Advertisement

సింగరేణి సంస్థకు చెందిన డీ.ఎం.ఎఫ్.టీ, సీఎస్సార్ నిధులను స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కాకుండా, సిద్దిపేట, హైదరాబాద్ జిల్లాలకు అక్రమంగా తరలించి దోచుకున్నది నిజం కాదా అని గండ్ర ప్రశ్నించారు. అంతేకాదు, 800 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్‌ను తుప్పు పట్టిన ఇనుముతో, నాణ్యత లేకుండా నిర్మించి పనికిరాకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీనేనని ఆయన ఆరోపించారు.

కార్మికులను తప్పుదోవ పట్టించొద్దు..

లాభాల్లో నడవాల్సిన సింగరేణిని అప్పులపాలు చేసిన చరిత్ర గులాబీ నేతలదేనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అమాయక సింగరేణి కార్మికులలో లేనిపోని అపోహలు సృష్టిస్తూ, వారిని తప్పుదోవ పట్టించాలని చూస్తే చూస్తూ ఊరుకునేది లేదని గండ్ర సత్యనారాయణ రావు హెచ్చరించారు.

Also Read: తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×