E-Paper
Advertisement

Bhupalpally district: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పేరుతో సైబర్ స్కాం..

Bhupalpally district: భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పేరుతో సైబర్ స్కాం..
Advertisement

సైబర్ నేరగాళ్ల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. అధికారులు ఎంత అవగాహన కల్పించినా ఎక్కడో ఒకచోట బాధితులు మోసపోతూనే ఉన్నారు. తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కలెక్టర్ పేరును వాడుకుని సైబర్ స్కాం చేసేందుకు ప్రయత్నించిన ఘటన వెలుగు చూసింది.

Advertisement

సైబర్ నేరగాళ్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఫోటోను ఒక కొత్త నంబర్ వాట్సాప్ ప్రొఫైల్‌గా పెట్టుకున్నారు. అనంతరం.. ఆ నంబర్ నుంచి తోటి అధికారులకు మెస్సేజ్‌లు పంపడం ప్రారంభించారు. అత్యవసరంగా డబ్బులు అవసరమని, వెంటనే పంపాలని కేటుగాళ్లు ఆ మెస్సేజ్‌లలో అడిగారు.

ఈ విషయం కలెక్టర్ రాహుల్ శర్మ దృష్టికి వచ్చింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న కలెక్టర్.. తన పేరుతో వస్తున్న ఈ మోసపూరిత సందేశాలపై వెంటనే జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

అదే విధంగా..  కలెక్టర్ రాహుల్ శర్మ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తన పేరుతో వస్తున్న ఈ మెస్సేజ్‌లను ఎవరూ స్పందించవద్దని డబ్బులు పంపవద్దని తోటి అధికారులు, ప్రజలను కోరారు. ఈ రకమైన మోసాల పట్ల ప్రజలు, ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పోలీసులు ఈ సైబర్ నేరగాళ్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ALSO READ: Atal Bihari Vajpayee statue: బహిరంగ సభ మధ్యలో అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే నక్కా

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×