E-Paper
Advertisement

bhupalpally BRS Fighting : భూపాలపల్లి బీఆర్ఎస్ లో డిష్యూం.. డిష్యూం

bhupalpally BRS Fighting : భూపాలపల్లి బీఆర్ఎస్ లో డిష్యూం.. డిష్యూం
Advertisement

bhupalpally BRS Fighting : భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ పార్టీ గ్రూప్ పాలిటిక్స్ మరోసారి బహిర్గతమయ్యాయి. ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి వర్గీయులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది.

భూపాలపల్లిలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనం ప్రారంభోత్సవానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకంపై మధుసూదనాచారి పేరు లేకపోవడంతో రగడ మొదలైంది.

Advertisement

ఎమ్మెల్యే గండ్ర కావాలనే శిలాఫలకంపై మధుసూదనాచారి పేరు లేకుండా చేశారని ఆయన వర్గీయులు వాగ్వాదానికి దిగారు. గండ్ర, మధుసూదనాచారి వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేయడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇరువర్గాల నాయకుల మధ్య మాట మాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. పలువురు కార్యకర్తలు పరస్పరం తోసేసుకున్నారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఇరువర్గాల నాయకులకు సర్దిచెప్పి గొడవను సద్దుమణిగించే ప్రయత్నం చేశారు.

Advertisement

ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలోనే మధుసూదనాచారి, గండ్ర వర్గీయులు రోడ్డున పడి కొట్టుకోవడం నియోజకవర్గంలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×