E-Paper
Advertisement

Kiran Kumar Reddy: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!

Kiran Kumar Reddy: ట్రంప్ ఏం చెబితే మోదీ అది చేస్తారా? భువనగిరి ఎంపీ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Kiran Kumar Reddy: భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం , లోక్ సభ స్పీకర్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ,ఇతర విపక్ష ఎంపీలకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్పీకర్ అడ్డుకుంటున్నారని చామల ఆరోపించారు. కేవలం బీజేపీ ,ఎన్డీఏ ఎంపీలకే ప్రాధాన్యత ఇస్తూ.. నిశికాంత్ దూబే, అనురాగ్ ఠాకూర్ వంటి వారికి అనవసరంగా మైక్ ఇస్తున్నారని ఆయన విమర్శించారు. 18వ లోక్ సభలో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిస్తూ, మహిళా ఎంపీలపై తప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వతంత్రంగా వ్యవహరించకుండా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాల విషయంలో వైట్ హౌస్ నిర్ణయాలకు మోదీ తలొగ్గడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చ జరగాలని, రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు విషయంలో ట్రంప్ భారత్‌పై ఒత్తిడి తేవడం మన సార్వభౌమాధికారానికి గొడ్డలిపెట్టు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశంలో విపరీతంగా పెరిగిన గ్యాస్, క్రూడాయిల్ ధరలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ.. పార్లమెంట్ నియమాలను ఉల్లంఘించి ఎనిమిది మంది ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. అవిశ్వాస తీర్మానంపై ఓటు వేసే హక్కు సభలోని 543 మంది సభ్యులకు ఉండాలని.. సస్పెండ్ అయిన వారికి కూడా ఆ అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి’ అనే నినాదంతో లోక్ సభ మకర్ ద్వార్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని, ఏ ఇతర దేశం లేదా నాయకుడి ఆదేశాలకు లొంగిపోవాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Also Read: జడ్జికే ‘డిజిటల్’ షాక్.. ఏకంగా రూ. 1.66 కోట్లు నొక్కేసిన సైబర్ కేటుగాళ్లు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×