E-Paper
Advertisement

Thummala : కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్.. ?తుమ్మలతో భట్టి భేటీ..

Thummala : కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఫిక్స్.. ?తుమ్మలతో భట్టి భేటీ..
Advertisement

Thummala : మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడం లాంఛనమేనని తెలుస్తోంది. తాజాగా తుమ్మలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లిలో భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై గంటపాటు ఇరువురు నేతలు చర్చించుకున్నారు. తన వద్దకు వచ్చిన భట్టి విక్రమార్కకు తుమ్మల శాలువా కప్పి సన్మానించారు.

తుమ్మలతో భేటీ తర్వాత భట్టి విక్రమార్క ఆయనతో జరిపిన చర్చలపై స్పందించారు. తెలంగాణ రాజకీయాల్లో తుమ్మల నాగేశ్వరరావు మచ్చలేని వ్యక్తి అని ప్రశంసించారు. ప్రస్తుత రాజకీయాల్లో తుమ్మల అవసరం ప్రజలకు ఉందని స్పష్టం చేశారు. అందుకే ఆయనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించేందుకే వచ్చానని తెలిపారు. అనుచరులతో కలిసి చర్చించిన తర్వాత తన అభిప్రాయం చెబుతానని తుమ్మల చెప్పారని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Advertisement

తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరడం ఖాయమని ఇప్పటికే తేలిపోయింది. సెప్టెంబర్ 6న ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీతో తుమ్మల భేటీ అవుతారని తెలుస్తోంది. రాహుల్ సమక్షంలోనే కాంగ్రెస్‌ కండువా కప్పుకుంటారని సమాచారం. ఈ క్రమంలోనే తుమ్మలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఈ అంశాలపైనే ఇరువురు నేతలు చర్చించారని తెలుస్తోంది.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×