E-Paper
Advertisement

ఢిల్లీలో భట్టి విక్రమార్క బిజీ బిజీ.. ఖర్గే, వేణుగోపాల్‌లతో హైలెవల్ మీటింగ్!

ఢిల్లీలో భట్టి విక్రమార్క బిజీ బిజీ.. ఖర్గే, వేణుగోపాల్‌లతో హైలెవల్ మీటింగ్!
Advertisement

Bhatti Vikramarka: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సోమవారం ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క.. అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు.

జార్ఖండ్‌లో త్వరలో జరగబోయే రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో తాను జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ అధినేతకు వివరించారు. రాజ్యసభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి, ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఆయన ఖర్గే దృష్టికి తీసుకెళ్లారు.

Advertisement

రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం, ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడంపై జార్ఖండ్ స్థానిక నాయకత్వంతో జరిపిన సంప్రదింపులను భట్టి విక్రమార్క ఈ సందర్భంగా ప్రస్తావించారు. కూటమి ఐక్యతను చాటేలా జార్ఖండ్ కాంగ్రెస్ నేతలు శ్రమిస్తున్న తీరును ఆయన ఏఐసీసీ అధ్యక్షునికి వివరించారు.అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమర్యాదపూర్వకంగా కలిసి,జార్షండ్ పరిస్థితులను వివరించారు.

Also Read: ఆర్టీసీ బస్సులో గంజాయి దందా.. తనిఖీల్లో పోలీసులకే దిమ్మతిరిగే షాక్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×