E-Paper
Advertisement

ఖమ్మం గడ్డపై భట్టి మాస్ వార్నింగ్.. కాంగ్రెస్ శ్రేణులను తాకితే బీఆర్‌ఎస్ నాయకులను వదిలిపెట్టం

ఖమ్మం గడ్డపై భట్టి మాస్ వార్నింగ్.. కాంగ్రెస్ శ్రేణులను తాకితే బీఆర్‌ఎస్ నాయకులను వదిలిపెట్టం
Advertisement

Bhatti Vikramarka: ఖమ్మం నగరంలో జరిగిన సూడా (SUDA), జిల్లా లైబ్రరీ చైర్మన్ల అభినందన సభ రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం నిలబడిన వారికి గుర్తింపు దక్కుతుందని చెబుతూనే, గత ప్రభుత్వ తీరుపై ఘాటు విమర్శలు గుప్పించారు.

తుమ్మల కామెంట్స్

Advertisement

సూడా చైర్మన్‌గా దుర్గ ప్రసాద్ నియామకంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. నిబద్ధత గల వ్యక్తికి ఈ పదవి దక్కడం వల్ల ఖమ్మం ఎమ్మెల్యేగా తనకు కొంత పనిభారం తగ్గిందని, రిలీఫ్ దొరికిందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడు కలిసినా దుర్గ ప్రసాద్ గురించే అడిగేవారని గుర్తు చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఏ నాయకుడైనా నాయకత్వం కోసం, కార్యకర్తల రక్షణ కోసం పనిచేయాలని తుమ్మల సూచించారు.

భట్టి విక్రమార్క ఘాటు వ్యాఖ్యలు

Advertisement

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ టికెట్‌పై గెలిచి స్వార్థంతో బీఆర్ఎస్‌లోకి మారిన వనమా వెంకటేశ్వరరావు, కందాల ఉపేందర్ రెడ్డి లాంటి వారిని క్షమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. గత పదేళ్లు జిల్లాలో తాను, పొదెం వీరయ్య మాత్రమే కాంగ్రెస్‌లో నిలబడి పోరాడామని.. కష్ట కాలంలో పార్టీని నమ్ముకున్న ప్రతి కార్యకర్తకూ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

సంక్షేమ పథకాలపై వరాల జల్లు

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం అందిస్తున్న పథకాలను భట్టి వివరించారు. డబుల్ బెడ్రూం పేరుతో గత ప్రభుత్వం మోసం చేస్తే, తమ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందని, త్వరలోనే రెండో విడత కింద మరో 2 లక్షల ఇళ్లు ఇస్తామని ప్రకటించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 20 వేల కోట్ల రుణాలు, 53 లక్షల కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకంతో పాటు, త్వరలోనే కులమతాలకు అతీతంగా ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల భరోసా కల్పించే ‘ఇందిరమ్మ బీమా పథకాన్ని’ అమలు చేయబోతున్నామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.

Also Read: ‘ఫ్యూచర్ సిటీ’ని అడ్డుకుంటే వంద మీటర్ల లోతున బొంద పెడతాం.. హరీష్ రావుకు మెట్టు సాయికుమార్ స్ట్రాంగ్ వార్నింగ్!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×