E-Paper
Advertisement

పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..

పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ.. సాక్ష్యాలతో వస్తానంటూ..
Advertisement

Bandi Bhageerath Case: బండి సంజయ్ కుమారుడు భగీరథ్ పై నమోదైన పోక్సో కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. పేట్ బషీరాబాద్ పోలీసులకు భగీరథ్ ఓ లేఖ పంపించారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో హాజరు కాలేకపోయినట్లు లేఖలో తెలిపారు. అయితే మే 15వ తేదీన సిట్ విచారణకు వస్తానని స్పష్టం చేశారు.

విచారణకు హాజరయ్యే సమయంలో కీలక ఆధారాలు, సాక్ష్యాలతో వస్తానని బండి భగీరథ్ లేఖలో పేర్కొన్నారు. సిట్ అధికారుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. ఈ కేసు దర్యాప్తునకు అవసరమైన సమాచారాన్ని సైతం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భగీరథ్ లేఖలో తెలియజేశారు. దీంతో ఈ నెల 15న జరిగే విచారణ.. బండి కుమారుడి కేసుకు సంబంధించి కీలక మారే అవకాశముంది.

Advertisement

వాస్తవానికి ఇవాళ (బుధవారం) మధ్యాహ్నం 2 గంటల లోపు పేట్ బషీర్ పేట్ పోలీసు స్టేషన్ లో విచారణకు రావాలని మంగళవారమే బండి భగరీథ్ కు సూచించారు. ఈ మేరకు కరీంనగర్ లోని ఆయన మేనమామకు నోటీసులు సైతం ఇచ్చారు. కానీ అతడు హాజరుకాకపోవడంతో పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారన్న చర్చ మెుదలైంది. పోక్సో కేసులో సిట్ విచారణకు హాజరుకాకపోతే.. నిందింతులు ఎవరైన చట్టపరమైన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది. అరెస్టు వారెంట్, మధ్యంతర బెయిల్ రద్దు, నాన్ బెయిలబుల్ వారెంట్ వంటివి జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తన గైర్హాజరికి సంబంధించి బండి భగరీథ్ లేఖ రూపంలో వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: Sofa Politics: ‘పుష్ప’ స్టైల్లో హార్స్ ట్రేడింగులు.. విజయ్‌పై ప్రతిపక్షాలు ఫైర్, అల్లాడిపోతున్న దళపతి

Advertisement

మరోవైపు కేసు దర్యాప్తు తీరుపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో నిష్పాక్షిక దర్యాప్తు కోసం డీజీపీ సీ.వీ.ఆనంద్ సిట్ ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ కేసును కూకట్ పల్లి జోన్​ డీసీపీ రితి రాజ్ విచారణ చేస్తున్నారు. దర్యాప్తు బాధ్యతలు అప్పగించిన మొదటి రోజే పేట్ బషీరాబాద్ స్టేషన్​ కు వెళ్లిన ఆమె ఏసీపీ, సీఐలతో మాట్లాడి అన్ని వివరాలు తెలుసుకున్నారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతోపాటు బాధితురాలి వాంగ్మూలాన్ని కూడా పరిశీలించారు. ఆ మరుసటి రోజు బాధితురాలిని పిలిపించి రెండోసారి స్టేట్​ మెంట్​ తీసుకున్నారు. ఈ క్రమంలో వెల్లడైన వివరాలతో సెక్షన్లను మార్చారు.

Also Read: కేంద్రం సంచలనం.. త్వరలో కొత్త గోల్డ్ పాలసీ.. ఇంట్లోని బంగారంపై వడ్డీ చెల్లింపు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×