E-Paper
Advertisement

BEER: సమ్మర్‌లో చిల్డ్ బీర్లకు డిమాండ్.. తెగతాగేస్తున్నారు మందుబాబులు..

BEER: సమ్మర్‌లో చిల్డ్ బీర్లకు డిమాండ్.. తెగతాగేస్తున్నారు మందుబాబులు..
Advertisement
beer sales

BEER: సమ్మర్ సుర్రుమంటోంది. బయటికొస్తే మాడు పగులుతోంది. ఇంట్లో ఉంటే ఉక్కబోస్తోంది. సాయంత్రం అయినా చెమటలు కారుతున్నాయి. ఇలాంటి సమయంలో.. చల్లటి బీరేస్తే.. ఆ మజానే వేరంటున్నారు మందుబాబులు. అనడమే కాదు.. ఏ మాత్రం టైమ్ దొరికినా.. బార్‌లోకి దూరిపోతున్నారు. చిల్డ్ బీర్ ఆర్డర్ చేస్తున్నారు. ఖర్చు ఎక్కువ అనుకునేవాళ్లు.. వైన్స్‌లో పర్మిట్ రూమ్‌లో సేదతీరుతున్నారు.

ఎండాకాలంలో బ్రాంది, విస్కీల కంటే బీర్ల అమ్మకాలే అధికంగా జరుగుతుంటాయి. ఎప్పటిలానే ఈసారి కూడా బీర్లు బాగా తాగేస్తున్నారు మద్యంప్రియులు. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ నెలలో ఇప్పటివరకు ఏకంగా కోటి బీర్లు అమ్ముడయ్యాయి. ఎక్సైజ్ లెక్కల ప్రకారం గడిచిన 17 రోజుల్లో నగరవాసులు దాదాపు 1.01 కోట్ల బీర్లు తాగేశారు.

Advertisement

గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో కలిపి మొత్తం 8 లక్షల 46 వేల 175 కేస్‌ల బీర్లు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో సగటున 10 శాతం చొప్పున విక్రయాలు పెరిగాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రికార్డుస్థాయిలో విక్రయాలు నమోదవుతున్నాయి. నెలకు సగటున లక్ష చొప్పున బీరు కేసుల విక్రయాలు అధికంగా నమోదయ్యాయి.

సాధారణంగా విస్కీ, బ్రాంది తదితర అలవాటున్న వ్యక్తులు కూడా ఎండల ప్రతాపంతో బీరు వైపు చూస్తున్నారు. ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం.. ఏప్రిల్‌లో గ్రేటర్‌ పరిధిలోని మూడు జిల్లాల్లో రోజూ సగటున 6 లక్షల బీర్లు అమ్ముడవుతున్నాయి. ఇలా, సమ్మర్‌లో చల్లటి బీరేసి చిల్ అవుతున్నారు మందుబాబులు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×