E-Paper
Advertisement

Telangana Bandh: రేపు తెలంగాణ మొత్తం బంద్.. ఎందుకంటే..!

Telangana Bandh: రేపు తెలంగాణ మొత్తం బంద్.. ఎందుకంటే..!
Advertisement

Telangana Bandh: తెలంగాణ రాష్ట్రంలో బీసీ హక్కుల సాధన కోసం వివిధ బీసీ సంఘాలు నడుం బిగించాయి. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు. రేపటి రాష్ట్ర బంద్‌కు అధికార కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో ఈ ఉద్యమానికి అనూహ్య బలం చేకూరింది. రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్, బీజేపీతో పాటు మావోయిస్టు పార్టీలు, సీపీఐ నుంచి కూడా మద్దతు లభించింది. దాదాపు అన్ని ప్రధాన రాజకీయ శక్తులు బీసీల రిజర్వేషన్ల డిమాండ్‌కు ఏకతాటిపైకి వచ్చాయి. ఈ పరిణామం బీసీ సంఘాల పోరాట బలాన్ని, రిజర్వేషన్ల అంశం యొక్క ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు, వామపక్షాలు, ఉద్యమ సంఘాలు మద్దతు తెలపడంతో రేపు బంద్ ప్రభావం సంపూర్ణంగా ఉండే అవకాశముందని తెలుస్తోంది. బంద్ కారణంగా పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడే అవకాశం ఉంది. ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థలు కూడా ఈ బంద్‌లో పాల్గొనడం లేదా బంద్‌కు మద్దతుగా సెలవు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా రవాణా సేవలు, వాణిజ్య సంస్థలు కూడా ఈ బంద్‌లో నిలిచిపోయే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం చేపట్టిన బంద్.. తెలంగాణ సామాజిక-రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలవనుంది. ప్రధాన పార్టీలన్నీ మద్దతు ప్రకటించడం ద్వారా, బీసీల న్యాయం కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత సీరియస్‌గా తీసుకుంటుందో అర్థమవుతోంది.

Advertisement

Also Read: ఇంజనీరింగ్ కాలేజీలో విషాదం.. క్లాస్‌ రూమ్‌లో ఉరివేసుకుని స్టూడెంట్ సూసైడ్

బీసీ రిజర్వేషన్లకోసం అక్టోబర్18న జరిగే తెలంగాణ బంద్​ విజయవంతం చేయాలన్నారు బీసీ జేఏసీ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య. బంద్​ కేవలం ఏఒక్కరికోసమో కాదు.. బీసీలందరి కోసం.. బీసీలందరూ పాల్గొనాలి.. ఈ బంద్​ దారి తప్పొద్దు.. ఒక్క ఎమర్జెన్ఈ సిరీస్​ తప్ప అన్ని విభాగాలు బంద్​ లో పాల్గొంటాయని చెప్పారు. బీసీ సంఘాల బంద్‌కు కాంగ్రెస్‌ మద్దతు తెలిపింది. బంద్‌కు మద్దతు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌కు కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి కట్టుబడి ఉందన్నారు.

Advertisement

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×