E-Paper
Advertisement

Batti vikramarka: ఏ ప్రాజెక్టు ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసు..వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రం ..

Batti vikramarka

Batti vikramarka: ఏ ప్రాజెక్టు ఎవరు నిర్మించారో ప్రజలకు తెలుసు..వాస్తవాలు తెలియాలనే శ్వేతపత్రం ..
Advertisement

Batti vikramarka: విద్యుత్‌ విషయంలో వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియజేయాలనే శ్వేతపత్రం విడుదల చేశామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్‌ విషయంలో పలువురు సభ్యులు విలువైన సలహాలు ఇచ్చారన్నారు. డిస్కమ్‌ల నష్టాలకు కారణం ఎవరో, ఏ ప్రాజెక్టు ఎవరి కాలంలో నిర్మించారో ప్రజలకు బాగా తెలుసన్నారు. విద్యుత్‌ ప్రాజెక్టుల నిర్మాణం రాత్రికి రాత్రే జరిగేవి కాదు, పూర్తి చేయడానికి దాదాపు 4 నుంచి 7 సంవత్సరాలు సమయం పడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే విద్యుత్‌ సమస్య పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన ప్రాజెక్టులు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి పూర్తయ్యాయన్నారు. కాంగ్రెస్‌ ఏర్పాటు చేసిన విద్యుత్‌ సంస్థల వల్లే బీఆర్ఎస్ నాయకులు విద్యుత్ ను ఇవ్వగలిగారని గుర్తు చేశారు.

Advertisement

రాష్ట్రంలో యాదాద్రి, పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల దాదాపు రూ.10 వేల కోట్ల భారం పెరిగిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. భద్రాది పవర్ ప్లాంట్ ఆలస్యం కావడం వల్ల 40 శాతం అదనపు వ్యయం పెరిగిందన్నారు.యాదాద్రి, భద్రాద్రి కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు తెచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని హె చ్చరించారు. యాదాద్రి, భద్రాద్రి, చత్తీస్ ఘడ్ ల విద్యుత్ ఒప్పందంతో కలిసి వచ్చిన విద్యుత్ 1000 మెగావాట్లు అని తెలిపారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×