E-Paper
Advertisement

Bandi Sanjay: వాలెంటైన్స్ డే సాక్షిగా వారిది ‘అక్రమ సంబంధం’.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్!

Bandi Sanjay: వాలెంటైన్స్ డే సాక్షిగా వారిది ‘అక్రమ సంబంధం’.. బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ వాలెంటైన్స్ డే సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ మూడు పార్టీల మధ్య ఉన్నది పవిత్ర బంధం కాదు.. ‘అక్రమ సంబంధం’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పార్టీలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు చెబుతూనే.. వారి మధ్య ఉన్న బంధాన్ని ప్రజల ముందు ఉంచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ బంధాన్ని ‘ఫెవికాల్ బంధం’ అని అభివర్ణించారని గుర్తు చేస్తూ.. ఇది ప్రజలను మోసం చేసే ‘ఎంజీ ’ బంధమని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.

Advertisement

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బీజేపీకి మేయర్ పీఠం దక్కకుండా చేసేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని ఆయన ఆరోపించారు. బీజేపీ ఎదుగుదలను అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని.. కానీ కరీంనగర్ ప్రజలు , బీజేపీ కార్యకర్తల ఐక్యత ముందు ఈ తప్పుడు ఎత్తుగడలు సాగవని హెచ్చరించారు.

‘వీరి ప్రేమ, వీరి అక్రమ బంధం ప్రజల చిత్కారాలతో, ఛీత్కారాలతో నిండు నూరేళ్లు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను’ అని బండి సంజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో ప్రజలు వీరి నాటకాలను గమనిస్తున్నారని.. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

బీజేపీని రాజకీయంగా దెబ్బతీయడానికి సిద్ధాంతాలు పక్కన పెట్టి మరీ ఈ పార్టీలు కలిశాయని.. కరీంనగర్ వేదికగా వారి అక్రమ సంబంధం బయటపడిందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి.. ప్రేమ దినోత్సవం రోజున రాజకీయ ప్రత్యర్థులపై బండి సంజయ్ చేసిన ఈ ‘ఘాటు’ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Also Read:  ’ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది‘..కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×