E-Paper
Advertisement

Bandi Sanjay : బండి సంజయ్ కు బెయిల్.. షరతులు ఇవే..!

Bandi Sanjay : బండి సంజయ్ కు బెయిల్.. షరతులు ఇవే..!
Advertisement

Bandi Sanjay : ఉత్కంఠ వీడింది. పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు బెయిల్‌ మంజూరైంది. ఆయన తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్ పై గురువారం హనుమకొండ జిల్లా ప్రధాన మున్సిఫ్‌ మేజిస్ట్రేట్ రాపోలు అనిత సుదీర్ఘ విచారణ చేపట్టారు. రాత్రి 10 గంటల సమయంలో బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చారు. రూ.20 వేల సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించారు.

బండి సంజయ్ కు పలు షరతులు విధించారు. దేశం దాటి వెళ్లొద్దని ఆదేశించారు. సాక్షులను ప్రభావితం చేసే విధంగా ప్రవర్తించవద్దని నిర్దేశించారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు సహకరించాలని కోరారు. బెయిల్‌ మంజూరవడంతో సంజయ్‌ శుక్రవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు.

Advertisement

మరోవైపు నిందితులు బండి సంజయ్‌, బూర ప్రశాంత్‌, మహేశ్‌లను విచారించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కమలాపూర్‌ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై వాదోపవాదాలు కొనసాగాయి. నిందితులకు కస్టడీ పిటిషన్‌ సమాచారం ఇవ్వాలని పోలీసులను ఆదేశిస్తూ మేజిస్ట్రేట్‌ విచారణను సోమవారానికి వాయిదా వేశారు. బండి సంజయ్‌ బుధవారమే దాఖలు చేసుకున్న బెయిల్‌ దరఖాస్తు గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు బెంచ్‌పైకి వచ్చింది.

రాత్రి 10 గంటల వరకు నిర్ణయం వెలువడకపోవడం, పోలీసులు కస్టడీ కోరుతూ దరఖాస్తు చేసిన పరిణామాలను బట్టి గురువారం బెయిల్‌ రాదనే అంతా భావించారు. దాదాపు 8 గంటల వాదోపవాదాల తర్వాత మేజిస్ట్రేట్‌ షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేశారు. కోర్టు ఆదేశాలతో ఇద్దరు వ్యక్తులు పూచీకత్తు సమర్పించడంతో బండి సంజయ్‌ను విడుదల చేయాలని కరీంనగర్‌ జైలు పర్యవేక్షకుడికి మేజిస్ట్రేట్‌ ఆదేశాలు జారీ చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×