// // Balakrishna met CM Revanth - సీఎం రేవంత్‌తో బాలకృష్ణ భేటీ, ఆ తర్వాత.. -->
E-Paper
Advertisement

Balakrishna Met CM Revanth: సీఎం రేవంత్‌తో బాలకృష్ణ భేటీ.. రెండు అంశాలపై..!

Balakrishna Met CM Revanth: సీఎం రేవంత్‌తో బాలకృష్ణ భేటీ.. రెండు అంశాలపై..!
Advertisement

Balakrishna met CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. ఆదివారం ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన బాలయ్యబాబు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలపై చర్చించారు.

రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇరువురు భేటీ కావడం ఇది తొలిసారి కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేరుగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. పైకి సాధారణ సమావేశమైనా, కీలక విషయాలు చర్చించారని అంటున్నారు పలువురు నేతలు.

Advertisement

రెండు అంశాలు ప్రస్తావించినట్టు వార్తలు వస్తున్నాయి. బసవతారకం కేన్సర్ ఆసుపత్రిని విస్తరించేందుకు బాలయ్య రెండేళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ శివారులో నూతనంగా నిర్మించాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ప్లాన్ అంతా ఓకే అయ్యిందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నమాట. దీని ప్రకారం మూడు రాష్ట్రాల రోగులకు దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రామకృష్ణా సినీ స్టూడియోను ఆధునీకరించనున్నారు. దీన్ని మణికొండకు షిప్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నారట.

Also Read: తెలంగాణలో స్కూల్స్ రీ ఓపెన్.. 2024-25 విద్యా సంవత్సరంలో ఫెస్టివల్ హాలిడేస్ ఇవే..

Advertisement

రెండోవైపు ఏపీ రాజకీయాల వైపు ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఏపీలో ఈసారి టీడీపీ అధికారం లోకి రావడం ఖాయమని బాలయ్య చెప్పారట. అంతేకాదు గతం కంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయని అన్నట్లు తెలుస్తోంది. సో.. మొత్తానికి ఇరువురు పలు అంశాలపై చర్చించుకోవడం మంచి పరిణామంగా వర్ణిస్తున్నారు సినీ పెద్దలు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×