E-Paper
Advertisement

Bhadrachalam Temple: రాములోరి లడ్డూ ప్రసాదంలో పురుగు నిజమేనా..? ఆలయ అధికారులు ఏమంటున్నారంటే..

Bhadrachalam Temple: రాములోరి లడ్డూ ప్రసాదంలో  పురుగు నిజమేనా..? ఆలయ అధికారులు ఏమంటున్నారంటే..
Advertisement

Bhadrachalam Temple: భద్రాచలంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సీతారామచంద్ర స్వామివారి టెంపుల్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆలయంలో భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో పురుగు ఉందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోతో భక్తుల్లో ఆందోళన, అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ ప్రచారం పూర్తిగా అవాస్తవమని, నిజానికి సంబంధం లేని దుష్ప్రచారమని దేవస్థానం అధికారులు స్పష్టంగా కొట్టిపారేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో లడ్డూ ప్రసాదంలో పురుగు కనిపిస్తోందంటూ చూపించడం ద్వారా.. ఆలయ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం జరుగుతోందని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు, ఎలా తీసినదో ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు. ప్రసాదం తయారీ, పంపిణీ ప్రక్రియలో నాణ్యతా ప్రమాణాలను కఠినంగా పాటిస్తున్నామని, ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేదని స్పష్టం చేశారు.

Advertisement

శ్రీరామ నవమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాల్లో లక్షల సంఖ్యలో భక్తులు దర్శనానికి వస్తుంటారు. అటువంటి ఆలయంపై ఆధారాలు లేని ఆరోపణలు చేయడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని దేవస్థానం అధికారులు పేర్కొన్నారు.

లడ్డూ ప్రసాదం తయారీ ప్రక్రియపై కూడా అధికారులు వివరాలు వెల్లడించారు. ఆలయంలో ప్రసాదాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిశుభ్రమైన వంటశాలల్లో తయారు చేస్తామని తెలిపారు. నిపుణుల పర్యవేక్షణలో శుద్ధమైన ముడి సరుకులతో, హైజీన్ నిబంధనలను కఠినంగా పాటిస్తూ ప్రసాదాన్ని సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రతిరోజూ వంటశాలలు, నిల్వ గదులను శుభ్రపరిచి, నాణ్యత తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు.

Advertisement

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో పూర్తిగా కల్పితమైందని, కావాలనే ప్రచారం చేస్తున్నారని అధికారులు ఆరోపించారు. ఆలయ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు కావాలనే ఇలాంటి వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. భక్తులు ఎలాంటి అపోహలకు లోనుకాకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని కోరారు.

ఈ ఘటనపై దేవస్థానం యాజమాన్యం కఠినంగా స్పందించింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు కూడా నమోదు చేసింది. వీడియోను ఎవరు రూపొందించారు, ఎలా వైరల్ చేశారు అన్న అంశాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టాలని కోరింది.

పోలీసులు ఈ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్ముల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని గుర్తించి, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మత విశ్వాసాలకు సంబంధించిన అంశాల్లో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే చట్టపరమైన పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Also Read: లిక్కర్ కిక్కు.. దక్షిణాదిలో తెలంగాణ టాప్!

ఇదిలా ఉండగా, భక్తులు పెద్ద సంఖ్యలో దేవస్థానం అధికారులకు మద్దతు తెలిపారు. ఆధారాలు లేని వీడియోలతో ఆలయ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నాలను ఖండించారు. భద్రాచలం ఆలయంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, ఇలాంటి దుష్ప్రచారాలను నమ్మబోమని పలువురు భక్తులు స్పష్టం చేశారు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×