E-Paper
Advertisement

Babu Mohan Nomination : స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్.. ఆ పార్టీతో సంబంధం లేదన్న బాబూమోహన్

Babu Mohan Nomination : స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్.. ఆ పార్టీతో సంబంధం లేదన్న బాబూమోహన్
Advertisement

Babu Mohan Nomination : తాను స్వతంత్ర అభ్యర్థిగానే నామినేషన్ వేసినట్లు సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్ వెల్లడించారు. నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసిన విషయం తెలిసిందే. గురువారం మధ్యాహ్నం వరంగల్ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వీల్ ఛైర్ లో వచ్చిన బాబూమోహన్ నామినేషన్ దాఖలు చేశారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాబూమోహన్.. తాను స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. కేఏ పాల్ కు చెందిన ప్రజాశాంతి పార్టీ తరపున నామినేషన్ వేస్తారని జరిగిన ప్రచారంలో నిజం లేదన్నారు. ఆయన కాఫీకి పిలిస్తే వెళ్లానని, అక్కడ తనకు కండువా కప్పి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినట్లు చెప్పారు. అంతే తప్ప.. పార్టీ సభ్యత్వం తీసుకోలేదని, ఆ రోజే ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేశానని స్పష్టం చేశారు.

Advertisement

Also Read : రాజీనామా పేరుతో హరీశ్ రావు డ్రామా: కాంగ్రెస్ నేతలు

తన ఫాలోవర్స్, అభిమానుల కోరిక మేరకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినట్లు చెప్పారు. కాగా.. బాబూమోహన్ వీల్ ఛైర్ లో రావడం అందరినీ కాస్త షాక్ కు గురిచేసింది. నడుమునొప్పి కారణంగానే వీల్ ఛైర్ లో వచ్చినట్లు సిబ్బంది తెలిపారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×